ప్రేక్షకులని అలరించే ఆటగాళ్ళు

11:56 - August 23, 2018

ఫ్రెండ్స్‌ మూవీ క్రియేషన్స్‌ పతాకంపై వాసిరెడ్డి రవీంద్రనాథ్‌, వాసిరెడ్డి శివాజి ప్రసాద్‌, మక్కెన రాము, వడ్లపూడి జితేంద్ర సంయుక్తంగా 'ఆటగాళ్ళు' సినిమాను నిర్మిస్తున్నారు. నారా రోహిత్‌, జగపతిబాబు ప్రధాన పాత్రధారులుగా దర్శన బానిక్‌ కథానాయికగా నటించారు.ఈ సినిమాకు పరుచూరి మురళి దర్శకత్వం వహించారు.  ఈ నెల 24న సినిమా విడుదల కానుంది. ఈసందర్భంగా బుధవారం అన్నపూర్ణ సెవెన్‌ ఎకర్స్‌లో ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేశారు. జగపతిబాబు మాట్లాడుతూ, 'ఈ సినిమా చేయడం కొంత రిస్క్‌తో కూడుకున్నది. అయినా నిర్మాతలు బడ్జెట్‌కి రాజీపడకుండా రిచ్‌గా తెరకెక్కించారు. పరుచూరి మురళి వల్లే సినిమాచేశా. ఆయన నాతో 'పెదబాబు' చేశాడు. సినిమా  ఫైనల్‌ అవుట్‌పుట్‌ చూశాక చాలా హ్యాపీగా అనిపించింది.  క్రైమ్‌, కోర్ట్‌ డ్రామా, ఇలా అన్నీ చాలా కొత్తగా ఉంటాయి. స్క్రీన్‌ప్లే బాగా వర్కౌట్‌ అయ్యింది. ఇందులో మొదటిసారి లాయర్‌ పాత్ర పోషించా. రోహిత్‌ డిఫరెంట్‌ పాత్రలో కనిపిస్తాడు.  ''బాణం', 'ప్రతినిధి', 'రౌడీఫెలో' చిత్రాల్లో భిన్నమైన పాత్రలు పోషించా. ఈ సినిమా ఓ కొత్త రకమైన జోనర్‌. ఇలాంటి చిత్రానికి నన్ను కన్విన్స్‌ చేసి తెరకెక్కించిన పరుచూరి మురళికి థ్యాంక్స్‌. సాయి కార్తీక్‌తో నాకిది ఏడవ చిత్రం. రీరికార్డింగ్‌ అద్భుతంగా ఇచ్చాడు. సినిమా ఫలితం పక్కన పెడితే విభిన్నమైన పాత్ర చేశానని సంతృప్తి ఉంది. సినిమా బాగా ఆడి నిర్మాతలకు డబ్బులు రావాలని కోరుకుంటున్నా' అని నారా రోహిత్‌ తెలిపారు. 'ఈ చిత్ర నిర్మాతలు నా స్నేహితులు. వాళ్ళు లేకపోతే సినిమా లేదు అని పరుచూరి మురళి తెలిపారు. దర్శకుడిగా ఇది నా తొలి చిత్రమని భావించి చేశా. జగపతిబాబు, రోహిత్‌ నన్ను నమ్మి సినిమా చేశారు. వారికి థ్యాంక్స్‌. తన మ్యూజిక్‌తో సాయి కార్తీక్‌ సినిమాను నెక్ట్స్‌ లెవల్‌కి తీసుకెళ్ళాడు. గోపీ మోహన్‌ సూపర్బ్‌ డైలాగ్‌లు రాశారు. విజరు సి.కుమార్‌ ఫొటోగ్రఫీ సినిమాకు ప్రాణం. సినిమా బాగా రావడానికి కారణమైన టెక్నికల్‌ టీమ్‌కు ధన్యవాదాలు' అని చెప్పారు.  స్నేహితుడి కోసం ఓ పర్పస్‌తో సినిమా నిర్మించాం. అందుకు చాలా హ్యాపీగా ఉంది' అని నిర్మాత వాసిరెడ్డి రవీంద్రనాథ్‌ తెలిపారు.