ప్రస్తుతం పవన్‌ ఆ సినిమాలో మాత్రం కనిపిస్తారట!

12:09 - November 22, 2018

 సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ ఇటీవల వచ్చిన వార్తలపై స్పందించిన పవన్ తాను ఇప్పట్లో సినిమాల్లోకి వచ్చేదే లేదని.. ప్రజాక్షేత్రంలో తాను చాలా బిజీగా ఉన్నానంటూ వెల్లడించారు. అయితే టాలీవుడ్‌లో మాత్రం పవన్ ఔనన్నా.. కాదన్నా ప్రస్తుతం ఒక్క సినిమాలో చేయడం మాత్రం ఫిక్స్ అంటూ చర్చలు జరుగుతన్నాయి. ఈ చిత్రంలో పవన్ క్యారెక్టర్ 45 నిమిషాల పాటు కనిపిస్తుందట. ఈ చిత్రంలో పవన్ ప్రజలు మెచ్చే పొలిటికల్ లీడర్‌గా కనిపించనున్నారని సమాచారం. అయితే ఈ చిత్రంలో హీరో ఎవరనేది మాత్రం కన్ఫర్మ్ కాలేదు. డాలి(కిషోర్ కుమార్ పార్థసాని) దర్శకత్వంలో ఓ సినిమా రాబోతోంది. దీనికి సంబంధించిన కథను ఆయన పవన్‌కు వినిపించారట. కథ మొత్తం విన్న పవన్ ఆ చిత్రం చేసేందుకు సిద్ధమైపోయారట.