ప్రముఖ నిర్మాత డి. శివ ప్రసాద్‌ రెడ్డి కన్నుమూత

10:28 - October 27, 2018

టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. కామాక్షీ మూవీస్‌ అధినేత ,ప్రముఖ నిర్మాత డి. శివ ప్రసాద్‌ రెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఈయన ఈ రోజు ఉదయం చెన్నైలోని అపోలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. 1987వ సంవత్సరంలో కామాక్షి మూవీస్ బ్యానర్ ప్రారంభించిన శివ ప్రసాద్ రెడ్డి.. శ్రావణ సంధ్య, విక్కీ దాదా, ఆటో డ్రైవర్, సీతారామరాజు, ముఠా మేస్త్రి, అల్లరి అల్లుడు, నేనున్నాను, కింగ్, కేడీ, రగడ, బాస్, దడ, గ్రీకు వీరుడు లాంటి ఎన్నో సూపర్ డూపర్ సినిమాలను నిర్మించారు. ఈయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపం తెలుపుతున్నారు.