ప్రభాస్‌ సినిమాకి ఫ్రెంచ్‌ టైటిల్‌

15:35 - October 8, 2018

బహుబలి తరువాత యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ తీస్తున్న చిత్రం ' సాహో ' ఇది కూడా భారీ ఖర్చు, శ్రమతో కూడుకున్న సినిమా. అయితే బహుబలి తీసేందుకే ప్రభాస్‌ ఐదు సంవత్సరాలు కేటాయించడం జరిగింది. ఇప్పుడు ' సాహో ' ఒక్కదాని కోసం రెండేళ్లు గడిస్తే...ప్రభాస్‌ కేరీర్‌కు పెద్ద నష్టం కలుగుతుంది. అందుకే ప్రభాస్‌ ' సాహో ' తో పాటు మరొక సినిమాకు కూడా సైన్‌ చేశారు. ఈ నేపథ్యంలోనే ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో మరో సినిమాను కూడా ఈ మధ్యే మొదలుపెట్టి ‘సాహో’తో సమాంతరంగా పూర్తి చేసే పనిలో పడ్డాడు ప్రభాస్. ఈ రెండు చిత్రాల షూటింగ్ యూరప్ లోనే జరుగుతుండటం విశేషం. ఇటీవలే ఇటలీలో ప్రభాస్-రాధాకృష్ణ సినిమా షూటింగ్ మొదలుపెట్టారు. చిత్రీకరణ జోరుగానే సాగుతోందట. ఇంతలోనే ఈ చిత్ర టైటిల్ గురించి ఆసక్తికర వార్త ప్రచారంలోకి వచ్చింది. ప్రభాస్-రాధాకృష్ణ సినిమాకు ‘అమూర్’ అనే టైటిల్ ఖరారైందట. ఈ అమూర్ ఏంటి అని ఆశ్చర్యం కలుగుతోంది కదా? ఇది ఫ్రెంచ్ పదమట. దానికి ‘ప్రేమ’ అని అర్థమట. ఈ సినిమా యూరప్ నేపథ్యంలోనే సాగుతుంది కాబట్గి.. టైటిల్ విషయంలో ఇబ్బందేమీ లేదని.. సినిమాలో ఒకచోట అర్థం చెప్పించేస్తే సరిపోతుందని.. ప్రేక్షకులకు ఇది డిఫరెంట్ ఫీలింగ్ ఇస్తుందని భావించి.. చిత్ర బృందం ఈ టైటిలే ఖరారు చేసిందట.