ప్రభాస్‌ను పొగిడేసిన లేడీ సూపర్‌ స్టార్‌...

15:07 - December 24, 2018

కంగనా రనౌత్ హీరోల గురించి పాజిటివ్ గా మాట్లాడటం అరుదే. హృతిక్ రోషన్ లాంటి పెద్ద స్టార్ నే ఉతికి ఆరేసిన హీరోయిన్ ఆమె. సినీ పరిశ్రమలో పురుషాధిక్యత గురించి కూడా తరచుగా కామెంట్లు చేస్తూ ఉంటుందామె. అలాంటి హీరోయిన్ మన ప్రభాస్ ను ఓ రేంజిలో పొగిడేయడం విశేషం. తెలుగులో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రభాస్ తో కలిసి ‘ఏక్ నిరంజన్’లో నటించానని.. అప్పటికి ప్రభాస్ పెద్ద స్టార్ కాదని.. కానీ ఇప్పుడు ‘బాహుబలి’తో ప్రపంచ స్థాయిలో గుర్తింపు సంపాదించాడని.. అతడి ఎదుగుదల చూస్తే తనకు గర్వంగా ఉందని కంగనా చెప్పింది. ‘ఏక్ నిరంజన్’ చిత్రీకరణ సమయంలో ఇద్దరం చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్లమని.. ఒకరినొకరు టీజ్ చేసుకునేవాళ్లమని చెప్పింది. అప్పటికి కంగనా చిన్న స్థాయి కథానాయిక. కానీ గత దశాబ్ద కాలంలో ఆమె రేంజ్ మారిపోయింది. ఇప్పుడు ఆమెను లేడీ సూపర్ స్టార్ అంటున్నారు.  ప్రభాస్ మంచి మనసున్న వ్యక్తి అని.. అతడితో మళ్లీ సినిమా చేయాలనిపిస్తోందని.. అందుకోసం వెయిట్ చేస్తున్నానని కంగనా  అంది. ఇక టాలీవుడ్లో కలిసి నటించాలనుకునే మరో హీరో ఎవరని అడిగితే.. మహేష్ బాబు పేరు చెప్పింది కంగనా.