ప్రభాస్‌కు ఆ సమస్య ఎందుకు తీరడంలేదు?

13:17 - December 19, 2018

రాజు గారి మంత్రదండం ఎటు విసిరితే అటే రంగు పడుతుంది. ఆ మంత్రదండం అటు తిరిగి ఇటు తిరిగి ఎటో వెళ్లిపోయినా వెళ్లిపోవచ్చు. ఇప్పుడు ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే....అధికార పీఠం దక్కించుకున్న పెద్దల అండదండలతో సినీ సెలబ్రిటీలకు ఎన్నో పనులు అవుతుంటాయి. ఏ వివాదాన్ని అయినా చాకచక్యం గా పరిష్కరించుకోవడం సాధ్యమవుతుంది. ఎంత ప్రతికూలంగా ఉండే మంత్ర దండాన్ని అయినా తమ కు అనుకూలంగా మార్చుకోవడంలో సినిమా వాళ్ల తర్వాతనే. కానీ ఎవరో కొందరికి మాత్రమే ఇలాంటి విషయాల్లో చాణక్యం కుదరకపోవచ్చు. ఆ వెనకబడిన జాబితా లో డార్లింగ్ ప్రభాస్ ఉన్నాడా?  పరిశ్రమ లో అందరికీ డార్లింగ్ అయిన ప్రభాస్ ఎందుకని తనకు వచ్చిన పొలిటికల్ ఇబ్బందిని సమస్యను పరిష్కరించుకోలేకపోతున్నాడు? . ఇదే ఇప్పుడు సమస్య. అసలు విషియానికి వస్తే...కొన్ని గుంటల భూమికి సంబంధించిన ఒక చిన్న లిటిగేషన్ని ప్రభాస్ ఎందుకు సమర్ధంగా ఎదుర్కోలేకపోతున్నాడు? ప్రస్తుతం అభిమానుల్లో సందేహాలివి. గులాబీ దళాలు మరోసారి అధికారంలోకి రాగానే .. కోర్టు తీర్పు సైతం డార్లింగుకు ఫేవర్ గా లేకుండా పోయిందేంటో? ఇంతకుముందు సేమ్ సన్నివేశం ఎన్.కన్వెన్షన్ అధినేత కింగ్ నాగార్జున  పద్మాలయ అధినేత సూపర్స్టార్ కృష్ణ శబ్ధాలయ అధినేత శ్యాంప్రసాద్ రెడ్డి వంటి వాళ్లు ఎదుర్కొన్నారు. ఈ విషయంలో ప్రభాస్ ఎలాంటి ట్యాలెంటు చూపిస్తాడో అంటూ ఆసక్తికర చర్చ సాగుతోంది. అయినా బాహుబలుడికి లేని కనెక్షన్ ఉందా?  అతడు తలుచుకుంటే ఇండస్ట్రీనే కదిలొస్తుంది. ప్రస్తుతం దిల్ రాజు- ఏషియన్ నారంగ్ వంటి ప్రముఖులు తనకు సాయపడేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. మరి డార్లింగ్ మంత్ర దండాన్ని తనవైపు తిప్పుకునేందుకు ప్రయత్నించడేం?  ప్రయత్నిస్తే కొండ మీంచి కోతినైనా దించేయొచ్చు కదా?  కోతిని దించేయొచ్చు కానీ కోర్టు గొడవల్లో కష్టం కదా? అంటారా..