ప్రధానికి స్వాగతం పలకం : గ్రామస్తుల బహిరంగ లేఖ

14:37 - October 30, 2018

స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ ఆవిష్కరణకు రానున్న ప్రధాని మోడీకి తాము స్వాగతం పలుకబోమని గుజరాత్‌లో నర్మదా జిల్లాలోని కెవాదియా ప్రాంత గ్రామస్థులు బహిరంగ లేఖలో పేర్కొన్నారు. రేపు పటేల్‌ విగ్రహావిష్కరణ జరగనుంది. ప్రధానికి రాసిన బహిరంగ లేఖపై సర్దార్‌ సరోవర్‌ డ్యామ్‌కు సమీపంలోని 22గ్రామాల సర్పంచులు సంతకాలు చేశారు. అడవులు, నదులు, జలపాతాలు, భూమి, వ్యవసాయం మొదలైనవి తాము తరతరాలుగా అనుభవిస్తున్నామని వారు పేర్కొన్నారు. ప్రస్తుతం వాటిని నాశనం చేస్తున్నారని, ఉత్సవాలు కూడా నిర్వహిస్తున్నారని వారు తెలియజేస్తున్నారు.