ప్రణయ్ హత్యపై వర్మ ట్విట్‌

16:20 - September 21, 2018

ప్రస్తుతం ఎక్కడ విన్నా, చూసినా ఒక్కటే హాట్‌ టాపిక్‌గా మారింది. అదే ఇటీవల మిర్యాలగూడలో జరిగిన  ప్రణయ్ పరువు హత్య. సోషల్‌ మీడియాలో, టీవీ ఛానల్స్‌లో, ఎవరి నోట విన్నా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు కూడా దీని మీద స్పందిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు. తాజాగా సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ దీనిపై ట్విట్‌ చేయడం జరిగింది. '' అమృత తండ్రి మారుతీ రావు ఒక పిరికి, క్రూరుడైన క్రిమినల్. ప్రణయ్‌ను హత్య చేసి ఆ కీర్తి ప్రతిష్టలను అతడు ఏం చేసుకోలేడు. ఒకవేళ అతను పరువుకోసమే హత్య చేసినట్టైతే.. అతను కూడా చావడానికి సిద్ధంగా ఉండాలి. నిజమైన పరవు హత్య అంటే పరువు కోసం హత్య చేసేవారిని హత్య చేయడమే'' అని వర్మ ట్వీట్‌లో పేర్కొన్నారు.