ప్రజల అభివృద్ధి గురించి ఆలోచించని ప్రజా ప్రతినిధులు ఎలా తిట్టుకుంటున్నారో చూడండి...

11:02 - October 5, 2018

రాష్ట్రంలో జరగబోయే ముందస్తు ఎన్నికలకు అన్ని పార్టీల వారూ సిద్ధమవుతున్నారు. అధికార పక్షంలో వున్నవారు ఇచ్చిన హామీలను కప్పిపుచ్చి, మరో మార్గంలో ప్రజలను మభ్యపెడుతుంటే...మరొకరు అధికార పక్షంలో వున్న వారు చేయని పనులను పదే పదే గుర్తుచేస్తూ ప్రతిపక్షం వాల్లు ప్రజలను మభ్యపెడుతున్నారు. ఇదిలా వుంటే...నాలుగైదు రోజుల నుండీ ప్రజల గురించి మాట్లాడడం మానేసి, అసలు వారి అభివృద్ధికి ఏం చేయాలో ఆలోచన కూడా మానేసి ఒకరిమీద ఒకరు బూతుల పురాణం చెప్పుకుంటున్నారు. 
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి..ఆపద్ధర్మ ముఖ్యమంత్రిని ' బట్టేబాస్‌ ' గాడు అన్నారు. అయితే ఇంత మాట అన్నాక మన కేసీఆర్‌ సారు ఊకుంటారా...! ఆయన కూడా ఆయన నోరు విప్పి...నా నోరు అసలే పెద్దది నేను తెరిస్తే తెల్లవార్లూ తిడుతునే వుంటాను. ' థూ... మీ బతుకులు చెడా..' మీకు సిగ్గుందా ..అని కాంగ్రెస్‌ వాల్లమీద ఆయన నోరు పారేసుకున్నారు. అంతేనా..అటు ఏపీ సిఎం చంద్రబాబును కూడా..తెలంగాణ ద్రోహి, నయవంచకుడు, బొడ్లో కత్తి పెట్టుకొని తిరుగుతున్నాడు.. అంటూ ఏకిపారేశారు.
ఇక తాజా మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎన్నికల ప్రచార కమిటీ కో- చైర్‌పర్సన్‌ డీకే అరుణ గారి విషియానికొస్తే...వారితో పాటు నేనేంటి అనుకుందో ఏమో తెలియదు కానీ...కాస్తా మసాలా ఎక్కువగానే వేశారు ఆమె మాటల్లో. ' టీఆర్‌ఎస్‌ నాయకుల తాట తీస్తాం ', ' ఖబడ్దార్‌...నాకొడకల్లారా!', అంటుంది.
ఇవన్నీ చూస్తున్న ప్రజలు తెలుసుకోవల్సింది...వీరికి అధికారంపై ఎంత వ్యామోహం లేకపోతే..ఒక ఉన్నత స్థానంలో వున్న వారు ఈ విధంగా తిట్టుకోవడం, అదీ వారికి ఓటేసి గెలిపించిన ప్రజల ముందు...అంటే వారు ప్రజలకిస్తున్న గౌరవం ఇదేనా..రాష్ట్రంలో ఎన్నో సమస్యలున్నాయి. వాటి పరిష్కారం గురించి ఆలోచించకుండా...సభలు పెట్టుకునేది ఒకరినొకరు తిట్టుకునేందుకే అన్నట్లుగా మన ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్నారు. ఇక ఈసారి ఎన్నికల్లో ఇలాంటి బూతుల పురాణం నోట్లో పెట్టుకొని తిరుగుతున్న వారికి ఓటేయకుండా...వీటన్నింటికీ అతీతంగా...ప్రజల కోసం పనిచేసే నాయకులకు ఓటేయాలి.