పోలింగ్‌ రోజు రెండు విషియాలపై క్లారిటీ ఇచ్చిన ఎన్నికల సంఘం

11:01 - November 30, 2018

తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు ఇంకా సరిగ్గా వారంరోజులు వున్నాయి. కరెక్టుగా ఇదే రోజు మన ఓటు హక్కును వినియోగించుకుంటాము. ఇదే నేపథ్యంలో అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారాల వేగాలను కూడా పెంచినవి. అయితే ఈ పర్వంలో అందరికీ ఒక డౌటు వుంది. అదేంటంటే...డిశంబర్‌ 7వ తేదీన సెలవు వుందా? లేదా? అని. ఎందుకంటే.. హైదరాబాద్లోని వేలాది ఐటీ కంపెనీలు ఆ రోజున పని చేస్తున్నాయి. అదేమంటే.. తమకు అమెరికా.. కెనడా.. యూరోపియన్ దేశాలతో పాటు.. మధ్య ప్రాచ్యంలోని దేశాలతో తాము ఒప్పుకున్న కాంట్రాక్ట్స్ లో భాగంగా ఆ రోజున పని చేసి తీరాలని వారు చెబుతున్నారు. దీంతో.. డిసెంబరు 7 సెలవు లేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇలాంటి వేళ తెలంగాణ ఎన్నికల సంఘం ప్రధానాధికారి తాజాగా క్లారిటీ ఇచ్చేశారు. తాజాగా సెక్రటేరియట్లో జరిగిన సమావేశంలో మాట్లాడిన ఆయన.. డిసెంబరు 7న ఓటర్లంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఎవరేం చెప్పినా.. డిసెంబరు 7న వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. ఇందులో ఎలాంటి అనుమానాలకు తావు లేదన్నారు. బ్యాలెట్ పేపర్ల ముద్రణ ఈ రోజు (నవంబరు 30) పూర్తి కానున్నట్లు చెప్పారు. పోలింగ్ లో కీలకమైన ఈవీఎంలు.. వీవీ ప్యాట్ యంత్రాల్ని సిద్ధం చేసిన వైనాన్ని ప్రస్తావించారు. పోలింగ్ రోజున ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఓటర్లకు స్లిప్పుల పంపిణీని మరింత వేగంగా జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఇదిలా వుంటే పోలింగ్‌లో ఓటర్లకు ఇంకొక సమస్య వుంటుంది. అదేనండీ తమ ఓటు ఏ పోలింగ్‌ బూత్‌లో వుందో తెలియదు. దీనిపై కూడా ఎన్నికల సంఘం ఒక క్లారిటీ ఇచ్చింది. అదేంటంటే!.. ఎన్నికల సంఘం తాజాగా నా వోట్ యాప్ ను తయారు చేసింది. దీన్ని ఉపయోగించటం చాలా ఈజీ. అండ్రాయిడ్.. ఐవోఎస్ వెర్షన్లలో అందుబాటులో ఉండే ఈ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకుంటే.. పోలింగ్ స్టేషన్ ఎక్కడ ఉందన్నది చాలా ఈజీగా గుర్తించొచ్చు. అదెలానంటే.. ఈ యాప్ ను ఓపెన్ చేసి పేరు కానీ.. ఎపిక్ నెంబరును టైప్ చేసిన వెంటనే ఓటరుకు సమీపంలో ఉండే పోలింగ్ బూత్ అధికారుల వివరాలు ప్రత్యక్షం కానున్నట్లు చెబుతున్నారు. సో.. ఇక్కడ క్లారిటీగా చెప్పుకోవాల్సిన అంశాలు రెండు.. అందులో మొదటిది.. పోలింగ్ రోజైన డిసెంబరు 7న వేతనంతో కూడిన సెలవు. రెండోది.. ఓటు ఏ పోలింగ్ స్టేషన్లో ఉందో తెలుసుకోవటానికి మొబైల్ యాప్. ఇదండీ పోలింగ్‌ రోజున జరిగే ముఖ్యమైన పనులు. అందరూ తప్పకుండా తమ ఓటును ఉపయోగించుకోని మన భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవాలి.