పేపర్ బాయ్ పై పెరిగిన అంచనాలు

16:03 - August 29, 2018

 పేపర్ బాయ్ చిత్రంను మొన్నటి వరకు ఒక చిన్న సాదా సీదా చిత్రంగానే అంతా చూశాము. ఎప్పుడైతే అల్లు అరవింద్ హోల్ సేల్ గా సినిమా రైట్స్ ను కొనుగోలు చేశాడో అప్పుడే సినిమా స్థాయి అమాంతం పెరిగి పోయింది. ఈ చిత్రంపై భారీ స్థాయిలో అంచనాలు క్రియేట్ అయ్యాయి. సినీ వర్గాల వారితో పాటు ప్రేక్షకుల్లో కూడా ఈ చిత్రం గురించిన చర్చ మొదలు అయ్యింది. తాజాగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. ఆ సందర్బంగా అల్లు అరవింద్ ఈ చిత్రంను తీసుకోవడం వెనుక కారణంను తెలియజేయడం జరిగింది. 

ప్రీ రిలీజ్ వేడుకలో అల్లు అరవింద్ మాట్లాడుతూ కొన్ని రోజుల క్రితం నాకు బన్నీ ఈ చిత్రం ట్రైర్ వీడియోను వాట్సప్ ద్వారా పంపించాడు. ఆ ట్రైలర్ నాకు బాగా నచ్చింది. సింపుల్ కథను దర్శకుడు చక్కగా చూపించాడు అనిపిచింది. అదే సమయంలో నిర్మాత సంపత్ నంది సినిమా చూడాల్సిందిగా కోరాడు. ట్రైలర్ నచ్చిన కారణంగా సినిమాను చూసేందుకు ఒప్పుకున్నాను.  ఈ చిత్రంకు మంచి పబ్లిసిటీ చేసి రిలీజ్ చేస్తే తప్పకుండా మంచి లాభాలు వస్తాయని సంపత్ నందికి చెప్పాను. అదే సమయంలో ఈ చిత్రాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నాను.