పెళ్లి ప్రచారంపై స్పందించిన త్రిష

15:58 - November 27, 2018

త్రిష ఒక మంచి హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. గ్లామర్‌ పాత్రలకే కాకుండా నటనకు ప్రాధాన్యతనిస్తూ కూడా త్రిష సినిమాలు చేసి విజయం చేజిక్కించుకుంది. తమిళంలో నటనకి ప్రాధాన్యత కలిగిన పాత్రలను .. నాయిక ప్రాధాన్యత కలిగిన పాత్రలను చేస్తూ, నయనతార తరువాత స్థానంలో త్రిష దూసుకుపోతోంది.అయితే ఈమె పైన పెళ్లికి సంబంధించి కొన్ని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. ఈ  విషయాలను గురించి తాజాగా త్రిష స్పందించింది. "ప్రస్తుతం నా పెళ్లి గురించి జరుగుతోన్న ప్రచారంలో ఎంతమాత్రం నిజంలేదు. ఈ మధ్య కాలంలో నా గురించి అసత్య ప్రచారాలు ఎక్కువైపోయాయి .. అందులో ఇదొకటి. నాకు నచ్చిన వ్యక్తి తారసపడితే .. నేను పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆ విషయాన్ని నేనే చెబుతాను. ఈ విషయాన్ని దాచాలని కూడా నేను అనుకోవడంలేదు. ఇక పెళ్లి తరువాత నేను సినిమాలు చేస్తానా .. మానేస్తానా అనేది అప్పుడు తీసుకోవలసిన నిర్ణయం. అందువలన అనవసరమైన ప్రచారాలకు దయచేసి ఫుల్ స్టాప్ పెట్టేయండి" అని చెప్పుకొచ్చింది.