పెళ్లి అనేది టైమ్‌ వేస్ట్‌ పని : వరలక్ష్మీ శరత్‌కుమార్‌

12:23 - November 15, 2018

వరలక్ష్మీ శరత్‌కుమార్‌ పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు చేయండం జరిగింది. ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ఆమె పెళ్లి గురించి, ప్రేమ గురించి మాట్లాడారు. పెళ్లనేది ఒక టైమ్ వేస్ట్ పని అని.. పెళ్లి చేసుకుంటే అదే మొహాన్ని రోజూ చూస్తూ కూర్చోవాలంటూ కాంట్రవర్సియల్ కామెంట్స్ చేశారు. 

''  పెళ్లి అనేది ఎవరికీ ఒక యాంబిషన్ కాదు. పాలిటిక్స్‌లోకి రావాలి అదొక యాంబిషన్. ఒక మంచిపని చేయాలనేదొక యాంబిషన్. పెళ్లి చేసుకుని ఏం చేస్తారు మీరు? ఎవరికైనా ఉపయోగముందా? లవ్ చేస్తే చేసుకోవచ్చు. పెళ్లి అనేది టైమ్ వేస్ట్ పని. పెళ్లి చేసుకుని రోజు ఒక్కడి మొహమే చూస్తూ కూర్చోవాలి. లవ్ చేస్తే చెయ్యాలి కానీ పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకురావడం వల్లనే పెళ్లి. ఎవరినైనా ప్రేమిస్తే.. వారితో ఉండొచ్చు. చాలా మంది మగవాళ్లు సింగిల్‌గానే ఉన్నారు. వారిని వచ్చి ఎవరూ అడగరు కదా. మహిళలు ఎందుకు అలా ఉండకూడదు? మహిళ సింగిల్‌గా ఉండొచ్చు. దేనికోసమూ ఒక మహిళ మగవాడిపై ఆధారపడాల్సిన అవసరం లేదు. నా సక్సెస్, నా యాంబిషన్స్‌ని హ్యాండిల్ చేసుకోవాలంటే నేను సెక్యూర్‌గా ఉండాలి. కానీ చాలామంది మగవాళ్లు సెక్యూర్‌గా ఉండరు. నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నవాడు తన జాబ్‌ని వదులుకోలేకపోతే.. తనకోసం నేనెందుకు నా జాబ్‌ని వదులుకోవాలి? అలాంటి మనిషి ఎవరైనా పుడితే వస్తాడు. లేదంటే నేనే సింగిల్‌గా ఉంటా. ఏం ప్రాబ్లమ్ లేదు ''  అని వరలక్ష్మి చెప్పుకొచ్చారు.