పెళ్లిపీటలెక్కబోతున్న దీపికా, రణవీర్‌...

13:06 - October 24, 2018

ఇటీవలే దీపికా, రణ్‌వీర్ అభిమానులకు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నామంటూ శుభవార్త వినిపించారు. ఇంతలోనే వెడ్డింగ్ ప్లాన్ కూడా సిద్ధమైంది. వీరి వివాహం ఇటలీలోని లేక్ కోమోలో అంగరంగ వైభవంగా జరగనుంది. నవంబర్ 13న సంగీత్, 14న సౌత్ ఇండియన్ స్టైల్లో వివాహం, 15న నార్త్ ఇండియన్ స్టైల్లో వివాహం, పార్టీ, డిసెంబర్ 11న ముంబైలోని గ్రాండ్ హయత్‌లో గ్రాండ్ రిసెప్షన్ జరగనుందని సమాచారం. కొన్నేళ్లుగా రణ్‌వీర్‌సింగ్, దీపికా పదుకుణే... వీరిద్దరి మధ్య సాగిన ప్రేమాయణం గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు.  ఎట్టకేలకు వీరిద్దరూ.. పెళ్లిపీటలెక్కబోతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే బాలీవుడ్ సినిమాల కంటే ప్రేమ వ్యవహారాల్లోనే ఈ జంట ఎక్కువసార్లు వార్తల్లో నిలిచిందంటే అతిశయోక్తి కాదు. అటు దీపికా.. ఇటు రణ్‌వీర్ ఇంట్లో పెద్దలు వీరి ప్రేమను అంగీకరించడంతో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లైంది.