పెరుగు వికటించి...పెళ్లి వేడుకల్లో విషాదం

17:16 - December 2, 2018

 ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్‌లో ఓ పెళ్లి వేడుకలో ఫుడ్ పాయిజన్ కారణంగా ముగ్గురు చనిపోగా.. వధూవరులు సహా 250 మంది తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఎంతో సరదాగా.. ఆనందంగా మొదలైన పెళ్లి వేడుక విషాదాంతమైంది. ప్రాథమిక సమాచారం ప్రకారం విందులో వడ్డించిన పెరుగు కలుషితమైనట్టు తెలిసినట్టు పోలీసులు తెలిపారు. దీనిపై పూర్తి విచారణ నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. చనిపోయిన వారిలో ఓ మహిళ, పదేళ్లలోపు ఇద్దరు పిల్లలున్నట్టు పోలీసులు వెల్లడించారు. బాధితులందరినీ బేరినాగ్, బాగేశ్వర్, అల్మోరా, కాప్‌కాట్, హల్ద్‌వానీ ప్రాంతాల్లోని ఆసుపత్రులకు తరలించినట్టు పేర్కొన్నారు.