పెరిగిపోతున్న రోడ్డు ప్రమాద మరణాలు

12:09 - September 12, 2018

రోజు రోజుకూ రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య పెరిగిపోతుంది. రోడ్డు పై వెళ్లాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితి ఎదురవుతుంది. రోడ్డు మీదకు వెల్లినవారు ఇంటికి సేఫ్‌గా తిరిగివస్తారనే గ్యారెంటీ లేకుండా పోయింది. అతివేగం, ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవ్‌ చేయడం, మద్యం సేవించి డ్రైవ్‌ చేయడం, రాంగ్‌ రూట్‌లో ప్రయాణం చేయడం, లెక్కకు మించి జనాబాను ఎక్కించడం...ఇవన్నీ కూడా మృత్యువు వైపు నడిపే మార్గాలే. ప్రమాదంలో మరణించిన వారిలో ఎంతోమంది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఎందుకంటే కుటుంబంలో మరణించినవారే పోషించేవారైనప్పుడు ఇక ఆ కుటుంబం రోడ్డున పడక తప్పదు కదా...తాజాగా తెలంగాణ లోని జగిత్యాల జిల్లా కొండగట్టులో బస్సు లోయలో పడి 58మంది నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. దేశంలోనే ఓ బస్సు ప్రమాదంలో ఇంతమంది చనిపోవడం ఇదే అత్యధికం అని మీడియాలో వార్తలొస్తున్నాయి.

2016లో చెన్నైలోని 7486 యాక్సిడెంట్లు చెన్నైలోనే జరిగాయి. దాని తరువాత స్థానంలో ఢిల్లీ ఉంది. ఢిల్లీలో 7375 ప్రమాదాలు జరిగాయి.  రాష్ట్రాల విషయానికి వస్తే అత్యధికంగా యూపీలో 12.8శాతం - తమిళనాడులో 11.4 శాతం - మహారాష్ట్ర 8.6 - కర్ణాటకలో 7.4శాతం ప్రమాదాలు సంభవించి మొదటి నుంచి వరుస స్థానాల్లో ఉన్నాయి. ఈ సంఘటనలపైన అధికారులు మరింత భాద్యత తీసుకోని రూల్స్‌ను పాటించాలి. అదికారులు ఎంత బాధ్యత తీసుకున్నప్పటికీ... మన ప్రాణం మన చేతిలో ఉన్నట్లుగా భావించి రోడ్డు పైన డ్రైవ్‌ చేసేటప్పుడు జాగ్రత్తగా వుండటం ప్రతిక్షణం గుర్తుంచుకోవాలి.