పెనిమిటి పాట పై అన్ని అంచనాలా!..

13:59 - September 19, 2018

జూనియర్‌ ఎన్టీఆర్‌ నటిస్తున్న అరవింద సమేత వీరరాఘవ పై అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఇది అక్టోబర్‌ 11న విడుదల కానుంది. అంతకన్నా ముందుగా ...ఇటీవలే విడుదల చేసిన మొదటి ట్రాక్ అభిమానుల నుంచే కాక సంగీత ప్రియుల నుంచి మంచి స్పందనే దక్కించుకుంది. మరీ తమన్ కెరీర్ బెస్ట్ ట్రాక్ అంటే అతిశయోక్తి అవుతుందేమో కానీ ఓవరాల్ గా మెప్పించిందనే చెప్పాలి. ఇక ఇవాళ సాయంత్రం విడుదల చేయబోతున్న పెనిమిటి పాట గురించి ఒక్కొక్కరు ఒక్కోరకంగా పొగడ్తలతో ముంచెత్తడంతో ఫ్యాన్స్ లో ఉత్సుకత పెరుగుతూ పోతోంది. 

ఇక ఈ పాట గీత రచయిత రామజోగయ్య శాస్త్రి అయితే త్రివిక్రమ్ కు రుణపడి ఉంటానని అంత గొప్ప సందర్భాన్ని తనకు ఇచ్చారని ఇది మాములు పాటగా ఉండబోదని గట్టి హామీ ఇచ్చేసారు. గతంలో భరత్ అనే నేను విషయంలో దండాలయ్యా సామీ పాట టైంలో కూడా ఈయన ఇలాగే హింట్ ఇచ్చారు. ఆయన చెప్పినట్టే అది ఆల్బమ్ లోనే బెస్ట్ సాంగ్ గా నిలిచింది. ఇప్పుడు పెనిమిటి కూడా అలాగే చెబుతుండటంతో అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు. ఇక దీనికి స్వరం అందించిన కీరవాణి తనయుడు కాలభైరవ కూడా ప్రత్యేకంగా ట్వీట్ చేయటంతో ఇది ఎలా ఉండబోతోంది అన్నది ఊహకు అందటం లేదు.