పూజా హెగ్డే మొదటి సంపాదన ఎంతో తెలుసా?

11:50 - October 24, 2018

టాలీవుడ్ లో మొదట నటించిన ‘ముకుందా’ ‘ఒక లైలా కోసం’ చిత్రాలు పెద్దగా ఆకట్టుకోలేక పోయాయి.  ‘డీజే’ చిత్రంతో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చి ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయిపోయింది. ప్రస్తుతం టాలీవుడ్ లో  మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా భారీ పారితోషికాలు అందుకుంటున్న ఈ అమ్మడు అందుకున్న మొదటి సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వక తప్పదు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పూజా హెగ్డే మాట్లాడుతూ...నేను స్కూల్ లో ఉన్న సమయంలోనే నాకు మొదటి సంపాదన వచ్చింది. అది ఇచ్చింది మరెవ్వరో కాదు మా తాతగారు. నా చేతి రాత చాలా బాగుంటుందని అంతా అనేవారు - అందుకే ఒకసారి మా తాతగారు ముంబయి అథ్లెటిక్ అసోషియేషన్ లో పాల్గొన్న విద్యార్థుల పేర్ల జాబితాను రాయమన్నారు. ఆ జాబితాను తాను చాలా అందంగా రాశాను నేను రాసిన లిస్ట్ ఆయనకు బాగా నచ్చడంతో అప్పుడే నాకు 200 రూపాయలు ఇచ్చారు. అదే నా నేను సంపాదించిన తొలి సంపాదనగా చెప్పుకుంటాను. ఆ రెండువందల రూపాయలు నా చేతికి వచ్చినప్పుడు నా ఆనందానికి అవదులు లేవు అంటూ తన తొలి సంపాదన గురించిన విశేషాలను చెప్పుకొచ్చి ముసిముసి నవ్వులు నవ్వింది. ఇదే సందర్భంలో పూజా ఆమె సినిమా ఎంట్రీ గురించి కూడా వివరించింది.  కాలేజ్ డేస్ లో పెద్దగా అందంపై శ్రద్ద పెట్టేదాన్ని కాదు - కనీసం లిఫ్ స్టిక్ కూడా నేను పెట్టుకునే దాన్ని కాదు. అయినా కూడా నాకు మిస్ ఇండియా టాలెంటెడ్ లో పాల్గొనే అవకాశం దక్కింది. అక్కడ విజయం దక్కిన తర్వాత 2010 మిస్ యూనివర్స్ పోటీల్లో రన్నరప్ గా నిలిచాను. అప్పటి నుండి నాపై నాకు నమ్మకం కలిగింది. ఆ సమయంలోనే పు కమర్షియల్ యాడ్స్ లో నటించాను. స్నేహితురాలి సలహా మేరకు సౌత్ సినిమాల్లో ఛాన్స్ ల కోసం ప్రయత్నాలు చేశాను అప్పుడే తమిళంలో మొదటి సినిమా ఛాన్స్ దక్కింది. ఆ తర్వాత తెలుగులో కూడా ఛాన్స్ దక్కాయి.