పూజా హెగ్డే అంత సాహసం ఎందుకు చేసిందో..?

16:55 - October 3, 2018

జూనియర్‌ ఎన్టీఆర్‌ నటించిన 'అరవింద సమేత వీరరాఘవ ' ఈ నెల 11న రిలీజ్‌ కాబోతుంది. ఈ నేపథ్యంలో విడుదలైన ట్రైలర్‌కు ప్రేక్షకులనుంచి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. అయితే ఈ సినిమాలో పూజా హెగ్డే ఒక సాహసం చేసిందనే చెప్పాలి. ఎందుకంటే ఆమెకు తెలుగులో ఇది ఐదో సినిమా మాత్రమే... ఇంతలోనే ఆమె వాయిస్‌ను డబ్బింగ్‌ చెప్పుకుంది. మొదటిసారి తారక్ తో కలిసి చేసిన మూవీ కోసం ఆ ప్రయోగానికి ఓకే చెప్పేసింది. కానీ తన ఒరిజినల్ గొంతును వింటే పెదవి విరిచేలా ఉండటం గమనార్హం.  ఇంత త్వరగా తెలుగులో స్వంతంగా గొంతు వినిపించాలని ఎందుకు అనుకుందో ఏమో కానీ అది అంతగా అతకలేదనే అభిప్రాయంతో ప్రేక్షకులు కూడా ఏకీభవిస్తున్నారు.  గతాన్ని చూస్తే...విజయశాంతి దశాబ్దానికి పైగా కెరీర్ పూర్తయ్యాక ఒసేయ్ రాములమ్మతో మొదలుపెట్టారు. రమ్యకృష్ణ సైతం అంతే టైం స్పాన్ లో చంద్రలేఖతో తన గొంతుని వినిపించడం స్టార్ట్ చేసారు. రోజా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారాకే ఆవిడ స్వరం ప్రేక్షకులకు తెలిసింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మరి పూజా హెగ్డే ఇంత త్వరగా డబ్బింగ్ చెప్పుకోవడం అటు యాస పరంగా గొంతులో లేని మాధుర్యం కృత్రిమంగా తెచ్చుకోవడం వల్ల మొత్తానికి తేడా కొట్టించింది.