పుకార్లతో షికార్లు కొడుతున్న కైరా క్రేజ్‌...

12:48 - November 11, 2018

బాలీవుడ్‌ బ్యూటీ కైరా క్రేజ్‌ ఇప్పుడు పుకార్లతో షికార్లు కొడుతుంది. ఈ బామ ' భరత్‌ అనే నేను ' అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన విషియం తెలిసిందే. అయితే అందులో హీరోయిన్‌ పాత్రకు అంతగా ప్రాముఖ్యత లేకపోయినా కైరాకు మాత్రం మంచి గుర్తింపు దక్కింది. ఇప్పుడు ప్రస్తుతం కైరా..రామ్‌ చరణ్‌ చిత్రం ' వినయ విధేయ రామ ' లో నటిస్తుంది. కానీ ఈ బామకు మరికొన్ని చిత్రాలలో ఇప్పటికే ఆఫర్లు వచ్చినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ - త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో రూపొందబోతున్న చిత్రంలో హీరోయిన్ గా కైరా అద్వానీ ఎంపిక అయ్యిందని కాస్త బలంగానే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు ఈ చిత్రానికి సంబంధించిన కథ ఫైనల్ కాలేదు. అప్పుడే హీరోయిన్ ను దర్శకుడు ఎలా ఫైనల్ చేస్తాడని కొందరు ప్రశ్నిస్తున్నారు. మరో వైపు మహేష్ బాబు - సుకుమార్ ల కాంబినేషన్ లో వచ్చే ఏడాది ప్రారంభం కాబోతున్న సినిమా కోసం కూడా కైరా అద్వానీని సంప్రదించినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఏ పెద్ద సినిమా మొదలు కాబోతున్నా కైరా పేరు పరిశీలనలో ఉందనో లేదంటే కైరాను తీసుకున్నారనో వార్తలు వస్తున్నాయి. చిరు 152వ చిత్రం కోసం కూడా కొరటాల శివ ఈమెను పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈమద్య కాలంలో ఒక హీరోయిన్ గురించి మరీ ఇంతగా పుకార్లు రావడం ఇదే కావచ్చు. పుకార్లలో షికార్లు చేస్తున్న ఎన్ని ప్రాజెక్ట్ లలో ఈమె ఉంటుందో చూడాలి. ప్రస్తుతానికి అయితే వినయ విధేయ రామ చిత్రం తప్ప అధికారికంగా ఏ ఒక్క సినిమా ఈమె చేయడం లేదని సమాచారం అందుతోంది.