పిచ్చి పిచ్చిగా ఉందా? అంటూ.. ఫ్యాన్స్‌ పై పవన్‌ ఫైర్‌

12:48 - October 21, 2018

తితలీ తుపాను బాధితుల్ని పరామర్శించేందుకు పర్యటిస్తున్న పవన్.. శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండటంలో నాగావళి నదిపై వంతెన నిర్మించాలంటూ నాగావళి వంతెన పోరాట సమితి 610 రోజులకు పైగా ఆందోళనలు చేస్తున్నారు. వీరిని పరామర్శించేందుకు పవన్ అక్కడకు చేరుకున్నారు.  రిలే నిరాహారదీక్షల శిబిరాన్ని చేరుకొని.. అక్కడి వారిని పరామర్శిస్తున్న పవన్ ను చూసిన ఆయన అభిమానులు.. పార్టీ కార్యకర్తలు.. కాబోయే సీఎం.. సీఎం అంటూ నినాదాలు చేశారు. దీంతో.. అభిమానుల్ని వారించే ప్రయత్నం చేశారు.పలుమార్లు పవన్ చెప్పినా ఆయన అభిమానులు ఆగలేదు. పవన్ మాటల్ని పట్టించుకోకుండా కాబోయే సీఎం.. కాబోయే సీఎం అంటూ నినాదాలు చేస్తున్న  వారిపై పవన్ తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శించారు. పిచ్చి పిచ్చిగా ఉందా?  మీరు మనుషులు కాదా?   ఇక్కడ ఇన్ని రోజులుగా దీక్ష చేస్తున్నారు.. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం అనటం మంచిది కాదంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.  కొన్నిసార్లు తనను కాబోయే సీఎంగా నినాదాలు చేసే అభిమానులను ఉత్సాహపరిచేలా వ్యాఖ్యలు చేసే పవన్.. మరికొన్నిసార్లు అందుకు భిన్నంగా తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న తీరు అభిమానులకు ఇప్పుడు షాకింగ్ గా మారింది. తాను కోరుకున్నప్పుడు.. తనకు రాజకీయంగా లాభం చేకూరేటప్పుడు కాబోయే సీఎం.. సీఎం అనేలా ప్రోత్సహించే పవన్.. అదే అభిమానులు తమకున్న అభిమానంతో  కాసింత అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తే మరీ ఇంతేసి మాటలు అంటారా? అన్న ఆగ్రహాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.