పవన్‌ చెప్పినందుకే అక్కడకు వెళ్లా....

11:09 - September 4, 2018

పవన్‌ కళ్యాణ్‌ మాటను అతని అభిమానులు ఎంతగానో గౌరవిస్తారు. ఇది అందరికీ తెలిసిన విషియమే. అయితే ఇప్పుడు ఏకంగా పవన్‌ చెప్పాడని ఒకరు హీరో అవ్వాలనుకున్నారు.  విషియంలోకి వెళ్తే... పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇచ్చిన ఓ హింట్ తో శ్రీకృష్ణ దేవరాయల సంస్థానమైన `విజయనగరం` నుంచి అభిలాష్ అనే కుర్రాడు స్ఫూర్తి పొందాడట. హీరో అవ్వాలని ఏకంగా పవన్ ఓ వేదికపై సూచించిన నటశిక్షణాలయంలో చేరి ట్రైనింగ్ అయ్యాడు. అంతేకాదు.. తొలి ప్రయత్నమే `ప్రేమకు రెయిన్ చెక్` ఆడిషన్స్ లో  హీరోగా చాన్స్ కొట్టేశాడు.

మీకు ఈ అవకాశం ఎలా వచ్చింది అని మీడియా అడిగిన ప్రశ్నకు అభిలాష్‌ మాట్లాడుతూ...ఆ ఆసక్తితోనే కొంత నటనా శిక్షణ కూడా తీసుకున్నాను. కానీ తరువాత ఏం చేయాలో తెలిసేది కాదు. ఆ టైంలోనే.. `పిల్లా నువ్వు లేని జీవితం` ఆడియో వేడుకను లైవ్ లో చూస్తున్నప్పుడు హీరో సాయిధరమ్ గురించి పవన్ చెప్పారు. ముంబై బ్యారిజాన్ లో శిక్షణ అద్భుతంగా ఉంటుందని అన్నారు. అది విని వెంటనే ముంబైకి వెళ్లి బ్యారిజాన్ లో చేరిపోయాను. అక్కడ ట్రైనింగ్ అవ్వగానే టాలీవుడ్ ఆడిషన్స్ లో తొలి ప్రయత్నమే `ప్రేమకు రెయిన్ చెక్` చిత్రంలో హీరోగా ఛాన్స్ దక్కింది. ఇది నా అదృష్టం. 

ఆఫీస్ లో ప్రేమాయణం అంటే జాబ్ తో కుదరదని నమ్మే కుర్రాడు ఏ పరిస్థితిలో ప్రేమలో పడ్డాడు? అన్న పాయింట్ తో తెరకెక్కిన సినిమా ప్రేమకు రెయిన్ చెక్.  నార్త్ స్టార్ అధినేత శరత్ మరార్ సమర్పణలో శ్రీనివాస్ గారు దర్శకనిర్మాతగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ఈ నెల 7న రిలీజ్‌ కానుంది.