పవన్‌లో కనిపించిందే..విజయ్ లోనూ కనిపిస్తుందట!

14:32 - November 17, 2018

విజయ్ దేవరకొండ  అర్జున్ రెడ్డి,  గీత గోవిందం చిత్రాలతో యూత్ లో విపరీతమైన క్రేజ్ ను దక్కించుకున్న హీరో. విజయ్ దేవరకొండలో పవన్ కళ్యాణ్ పోలికలు కనిపిస్తూ ఉంటాయని ఆయన అభిమానులు మరియు సాదారణ ప్రేక్షకులు కూడా అంటూ ఉంటారు. కెరీర్ ఆరంభంలో పవన్ కూడా యూత్ ఆడియన్స్ ను పిచెక్కించాడు. తన సినిమాలతో తన సహజ సిద్దమైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా తన సహజ సిద్దమైన నటనతో అలరిస్తూ వస్తున్నాడు. పవన్ కళ్యాణ్ స్టార్ హీరోగా గుర్తింపు ఉన్నా కూడా తనకు సినిమాలపై ఆసక్తి లేదని ఎప్పుడైనా సినిమాలు మానేస్తాను అంటూ చెబుతూ వచ్చేవాడు. ఇప్పుడు అదే విధంగా విజయ్ దేవరకొండ కూడా అంటున్నాడు. విజయ్ దేవరకొండ ట్యాక్సీవాలా చిత్రం షూటింగ్ సమయం ఉండగా ఆయన తల్లికి అనారోగ్యం చేసిందట. అయితే షూటింగ్ కారణంగా ఆమె వద్దకు వెళ్లి ఆమెకు తోడుగా ఉండలేక పోయాడట. ఆ సమయంలో సినిమాలు మానేయాలనే ఆలోచన వచ్చిందట. సినిమాల్లో స్టార్ డం దక్కినా కూడా వరుసగా చిత్రాల్లో నటించాలనే తపన పవన్ లో కనిపించేది కాదు. ఇప్పుడు అలాగే విజయ్ దేవరకొండలో కూడా తన స్టార్ డంను ఉపయోగించుకుని వరుసగా చిత్రాలు చేయాలనే ఆలోచన ఉన్నట్లుగా అనిపించడం లేదు. సినిమా వల్ల తన వారికి దగ్గరగా ఉండలేక పోతున్నానే అనే భావన రావడంతో ట్యాక్సీవాలా చిత్రం తర్వాత మళ్లీ నటించవద్దనుకున్నాను. తీసుకున్న అడ్వాన్స్ లు తిరిగి ఇవ్వాలనుకున్నాను. కాని మరోసారి ఆలోచించి వెనక్కు తగ్గినట్లుగా విజయ్ దేవరకొండ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.