పవన్‌పై మళ్లీ మొదలైన కత్తి గోల

15:06 - December 2, 2018

సినీ విమర్శకుడు కత్తి మహేశ్ ట్వీట్లు - టీవీ చర్చల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు కొన్ని నెలల క్రితం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి దుమారం రేపాయో అందరికీ తెలిసిందే.  ముఖ్యంగా కత్తి మహేశ్ కు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు మధ్య గట్టి వార్ నడిచింది. అయితే కారణాలు ఏమైనా కావచ్చు కొంత కాలంగా ఈ కత్తి విమర్శలు కాస్త తగ్గాయి. అయితే - తాజాగా కత్తి మహేశ్ మరోసారి పవన్ ను గెలికాడు. తమ మధ్య నడుస్తున్న వార్ కు కాస్త గ్యాప్ వచ్చిందే తప్ప అది ఇంకా పూర్తవలేదని సంకేతాలిచ్చాడు. పవన్ను విమర్శిస్తూ ఓ ట్వీట్ చేశాడు. దానిపై పవన్ అభిమానులూ మళ్లీ రెచ్చిపోతున్నారు. దీంతో మళ్లీ తెలుగు రాష్ట్రాల్లో కత్తి గోల మొదలైందని పలువురు చెప్పుకుంటున్నారు. అసలు విషియం ఏంటంటే...ఇటీవల పిఠాపురంలో పవన్ పర్యటించారు. ఓ సభలో ప్రసంగించారు. సభకు వచ్చినవారంతా సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. దీంతో పవన్ స్పందిస్తూ.. శ్రీపాద వల్లభుడి ఆశీర్వాదం ఉంటే తాను తప్పకుండ సీఎం అవుతానని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను తీసుకోని కత్తి మరోసారి విమర్శలకు తెరతీశారు.  జనం అరిస్తే - దేవుడు దయ తలిస్తే హిట్టవ్వడానికి ఇదేమైనా సినిమా అనుకుంటున్నావా పవన్ అంటూ కత్తి మహేష్‌ ఎద్దేవా చేశాడు. సినిమాకైతే కథ బాగుండాలని దాన్ని బాగా తెరకెక్కించగలగాలని సూచించారు. రాజకీయాల్లో అయితే నువ్వేంటో తెలియాలి. గెలిస్తే ఏం చేస్తావో చెప్పాలి. ఇచ్చిన హామీలను నెరవేర్చగలనని ప్రజలను నమ్మించాలి. నీ తరఫున నిలబడినవాళ్లు మెజారిటీ స్థానాలు గెల్చుకోవాలి. అప్పుడే నువ్వు సీఎం అవుతావ్. తెలుసుకో పవన్ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించాడు. కత్తి ట్వీట్ పై జనసేన కార్యకర్తలు - పవన్ ఫ్యాన్స్ దీటుగా స్పందిస్తున్నారు. కత్తిపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు.