పరుసులోనే పేలిపోయిన... ప్రభుత్వ ఫోన్‌

11:41 - September 5, 2018

 

 

 

 

 

ఆమె ఓ అంగన్వాడీ కార్యకర్త. ఆమెకు ప్రభుత్వం ఓ ఫోన్ ఇచ్చింది. ఆ ఫోన్ ను పర్సులో పెట్టుకని ఓ ప్రభుత్వ కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా పర్సులోనే పేలిపోయిందా ఫోన్. ఈ ఘటన అనంతపురం జిల్లా కళ్యాణ దుర్ఘంలో జరిగింది. స్థానిక అంగన్వాడీ కార్యకర్త యల్లవతికి రాష్ట్ర ప్రభుత్వం ఓ కార్బన్ కంపెనీ ఫోన్ ఇచ్చింది. సదరు ఫోన్ పర్సులో పేలిపోయింది. పర్సుతోపాటూ అందులో ఉన్న నగదు కూడా కాలిపోయింది. గతంలో కళ్యాణదుర్గం మండలంలో లోని మరో అంగన్వాడీ కార్యకర్త అనురాధ ఫోన్ కూడా ఛార్జింగ్ పెట్టిన సమయంలో పేలిపోయింది. ఐతే ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లు సరిగ్గా పని చేయడం లేదని.. అలాగే ఎప్పుడు పేలిపోతాయోనని భయంగా ఉందని అంగన్వాడీలు అనుకుంటున్నారు.