పడి పడి లేచే మనసుకు రాజీ లేదట!

11:08 - November 14, 2018

ఈ ఏడాది చివర్లో వస్తున్న శర్వానంద్ పడి పడి లేచే మనసు మీద యూత్ లో మంచి అంచనాలు ఉన్నాయి. మొదటి సారి సాయి పల్లవితో జోడి కట్టిన శర్వాకు తనతో కుదిరిన కెమిస్ట్రీకి మంచి మార్కులు పడుతున్నాయి. ఇప్పటికే టీజర్ ప్లస్ ఆడియో ట్రాక్ మంచి స్పందన దక్కించుకున్న నేపథ్యంలో ఫైనల్ అవుట్ ఫుట్ మీద దర్శకుడు హను రాఘవపూడి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు టాక్. ఈ సినిమా విషియంలో ఎలాంటి పొరపాటుకు ఛాన్స్ ఇవ్వడం లేదట. అందుకే అవసరం మేరకు కొన్ని సీన్లు రీ షూట్ చేసేందుకు సైతం వెనుకాడటం లేదని తెలిసింది. కథలో ఉన్న డెప్త్ మేరకు సాయి పల్లవి సైతం డేట్స్ అడ్జస్ట్ చేసుకుని మరీ సహకరిస్తోందట. శర్వాతో పటు నిర్మాత సలహాలు పరిగణనలోకి తీసుకుని హను ఇవన్నీ చేస్తున్నట్టు తెలిసింది.  డిసెంబర్ 21న విడుదల కానున్న పడి పడి లేచే మనసు శర్వానంద్ తో సాయి పల్లవికి ఏడాది తర్వాత వస్తున్న మూవీ. మొత్తానికి రాజీ పడే ధోరణికి దూరంగా పడి పడి లేచే మనసుని బెస్ట్ లవ్ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దే ప్రయత్నంలో హను రాఘవపూడి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది.