పకోడీ వ్యాపారీ ఆధాయాన్ని లెక్కకట్టిన అధికారులకు నోట మాట రాలేదు!

13:53 - October 7, 2018

అతను ఒక పకోడీ వ్యాపారీ...పకోడీ వ్యాపారే కదా!...ఇతని గురించి ఏముంటుందీ అనుకోకండి. అతని ఆదాయాన్ని లెక్కకట్టిన ఐటీ శాఖ అధికారులకు నోట మాట రాలేదు. అవునండీ ఇది నిజమే... అసలు విషియానికి వస్తే... పంజాబ్ లోని లూథియానాలో ఒక పకోడీ వ్యాపారి వ్యవహారం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇతగాడు అమ్మే పకోడీల కోసం సామాన్యుల మొదలు సెలబ్రిటీల వరకూ క్యూ కట్టేస్తుంటారు. 1952లో చిన్న కొట్టుగా స్టార్ట్ అయిన ఈ పకోడీ వ్యాపారం ఇప్పుడు భారీగాపెరటమే కాదు.. వ్యాపారాన్ని ఓ రేంజ్లో పెంచేశాడు. తాజాగా అతగాడి ఆస్తులు.. ఆదాయం గురించి ఐటీ శాఖ వారు దృష్టి సారించారు. అతడి వ్యాపారాన్ని.. ఆదాయాన్ని లెక్క కట్టిన వారికి నోటి వెంట మాట రాలేదు.  పకోడీ వ్యాపారి ఆదాయం భారీగా ఉండటమే కాదు.. అతగాడు ప్రభుత్వానికి కట్టకుండా ఎగ్గొట్టిన పన్ను ఏకంగా లక్షల్లోనే ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో అతగాడికి రూ.60లక్షల జరిమానాను విధించారు. ఈ కేసు నుంచి బయపడేందుకు వీలుగా అధికారులు విధించిన రూ.60లక్షల ఫైన్ ను కట్టేశాడట పకోడీ వ్యాపారి.