' పందెంకోడి 2 'తో మళ్లీ తన సత్తా చాటిన విశాల్‌

11:06 - October 29, 2018

తమిళ హీరో విశాల్ తన ప్రతి సినిమాను తెలుగులో డబ్ చేస్తున్న విషయం తెల్సిందే. తెలుగులో ‘పందెంకోడి’ చిత్రంతో సక్సెస్ ను దక్కించుకుని అప్పటి నుండి కూడా తన ప్రతి సినిమాతో సక్సెస్ కొట్టేందుకు చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. విశాల్ చాలా కాలంగా సక్సెస్ లు దక్కించుకోలేక పోయిన కారణంగా విశాల్ సినిమాలకు మార్కెట్ పడిపోయింది. ఆ మద్య విశాల్ సినిమా తెలుగు డబ్బింగ్ రైట్స్ ను కోటిన్నరకు కూడా కొనేందుకు ఏ ఒక్కరు ముందుకు రాలేదట. దాంతో స్వయంగా విశాల్ రంగంలోకి దిగి ఆ చిత్రాన్ని విడుదల చేసుకున్నాడు. ఇక అభిమన్యుడు చిత్రం పై మంచి అంచనాలు వచ్చిన నేపథ్యంలో తెలుగులో ఏదోలా రెండు కోట్లకు బిజినెస్ చేసింది. తాజాగా పందెంకోడి 2 చిత్రంను ఏకంగా ఆరు కోట్లకు విశాల్ అమ్మగలిగాడు. ‘పందెం కోడి 2’ చిత్రం యావరేజ్ సక్సెస్ ను దక్కించుకుంది. అయినా కూడా దాదాపు ఏడు కోట్ల వరకు వసూళ్లు వచ్చాయి. అదే సినిమా సక్సెస్ టాక్ వస్తే ఖచ్చితంగా 10 నుండి 15 కోట్లు ఈజీగా దక్కించుకునే ఛాన్స్ ఉంది. అందుకే విశాల్ తదుపరి చిత్రం మంచి రేటు పలికే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు. ఏదిఏమైనా ' పందెంకోడి 2 ' తో మళ్లీ విశాల్‌  తెలుగు ఇంటస్ట్రీలో తన సత్తా చాటుకున్నాడు అనటంలో ఎటువంటి సందేహం లేదని సినీ వర్గాల వారు అంటున్నారు.