పండ్లు తినడం ఎంతో ఆరోగ్యం

17:38 - August 25, 2018

కొన్ని రుగ్మతల నివారణలో కొన్ని రకాల పండ్లు మేలు చేస్తాయి. ఏ రకం పండ్లు ఎలాంటి మేలు చేస్తాయో తెలుసుకోవాలనుకుంటున్నారా?

- బొప్పాయి, పుచ్చపండ్లలో బీటా క్రిపొక్సాంథిన్‌ గుణాలు ఎక్కువగా వుంటాయి. ఇవి లంగ్‌ క్యాన్సర్‌ నుంచి కాపాడతాయి. ఇతర రకాల క్యాన్సర్ల నుంచి కాపాడే లికోపెన్లు లభిస్తాయి. బొప్పాయిలోని పపెయిన్‌ ఎంజైమ్‌ జీర్ణశక్తికి బాగా సహకరిస్తుంది. 

- ఒక కప్పు జామపండు ముక్కల్లో లభించే విటమిన్‌ సి రోజువారీ అవసరానికంటే ఐదు రెట్లు ఎక్కువ వుంటుంది. మధ్యస్తంగా ఉండే కమలాపండులో కంటే ఇది ఎక్కువగా ఉంటుంది. 

- విటమిన్‌ సి అధికంగా వుండే పండ్లు తినే మహిళల్లో చర్మంపై ముడతలు వచ్చే అవకాశాలు మిగతావారికంటే తక్కువగా వుంటాయి. బ్యాక్టీరియాను ఎదుర్కొనే శక్తి కూడా లభిస్తుంది. 

- గుండెను పరిరక్షించుకోవాలంటే.. ద్రాక్ష పండ్లను తీసుకోవాలి. ద్రాక్ష, లిచీ పండ్లలో గుండెకు ఆరోగ్యాన్ని ఇచ్చే పాలిపినాల్స్‌ అధికంగా ఉంటాయి. క్యాన్సర్‌ వంటి వ్యాధులను అరికట్టడంలో పాలిఫినాల్స్‌ బాగా పనిచేస్తాయి. 

- రక్తపోటును తగ్గించగల పొటాషియం అత్తి, అరటిపండ్లలో లభిస్తుంది.

- బ్రెస్ట్‌ క్యాన్సర్‌కు చెక్‌ పెట్టాలంటే లిచీలు మంచివి. దీనిలో యాంటీ ఆక్సిడెంట్‌ యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. 

- కొలెస్ట్రాల్‌ను తగ్గించగల పీచుపదార్థం గంగ రేగు పళ్ళలో, యాపిల్స్‌లో ఎక్కువగా లభిస్తాయి. రోజుకు అవసరమైన పీచులో నలభై శాతం ఈ పండ్ల నుంచి లభిస్తుంది. పీచుపదార్థాలు ఎక్కువగా తినేవారిలో కొలెస్ట్రాల్‌ స్థాయి తక్కువ.