' నోటా ' తో పాటు మరో రెండు - మరి గెలుపెవరిదో..?

15:25 - October 4, 2018

విజయ్ దేవరకొండ నటించిన ' నోటా ' రేపు రిలీజ్‌ కానుంది. అయితే దీనితో పాటు మరో రెండు చిత్రాలు రేపు రిలీజ్‌ కానున్నాయి. అంటే ' నోటా ' కి ఇప్పుడు ఆ రెండు చిత్రాలు పోటీ అవుతున్నట్లు సమాచారం. తమిళ రాజకీయాలను టార్గెట్ చేసి  తీస్తోన్న ' నోటా ' సినిమాలో నటించడానికి హేమాహేమీలైన తమిళ హీరోలు జంకారు. అందుకే తెలుగు స్టార్ హీరో విజయ్ ను తీసుకొచ్చి సినిమా పూర్తి చేస్తారు. తమిళ దిగ్గజ నటులు సత్యరాజ్ - నాజర్ లు ఇందులో తమిళ ముఖ్యమంత్రుల పాత్రలు పోషించారట.. విజయ్ ఒక్కడే ఇందులో తెలుగు నటుడు. ‘నోటా’ను తెలుగు - తమిళ్ లో రిలీజ్ చేస్తున్నారు. తమిళ రాజకీయాలను షేక్ చేసే ఈ కథ ఇప్పుడు ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందనేది అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతం విజయ్ ‘నోటా’కు పోటీగా తమిళంలో రెండు సినిమాలు విడుదలవుతున్నాయి. అందులో ఒకటి విజయ్ సేతుపతి-త్రిష నటించిన ‘96’ మూవీ. ఈ సినిమా రెండు రోజుల ముందే ప్రివ్యూలు వేశారు. చూసిన వాళ్లు - రివ్యూ రైటర్లంతా బ్లాక్ బస్టర్ అని కితాబిచ్చేశారు. శుక్రవారం రాబోతున్న మరో మూవీ ‘రాక్షసన్’ తమిళంలో వచ్చిన బెస్ట్ థ్రిల్లర్ లలో ఒకటిని తేల్చిపారేశారు. దీంతో ఈ రెండు సూపర్ హిట్ ల నడుమ విజయ్ ‘నోటా’వస్తోంది. బాగుంటే ఓకే.. ఏమాత్రం టాక్ తేడా వచ్చినా కానీ ఈ రెండు సినిమాల మధ్య కొట్టుకుపోవడం ఖాయమని అంటున్నారు.