' నోటా 'డేట్‌ మార్చుకోమంటున్న ఎన్టిఆర్‌ ఫ్యాన్స్‌

12:24 - September 22, 2018

సినిమా రంగంలో మొదటి నుంచీ కూడా ఒక హీరో ఫ్యాన్స్‌ కు మరో హీరో ఫ్యాన్స్‌కు గొడవులు వుండటం సహజం. అయితే ఇప్పుడు టెక్నాలజీ మార్పుతో ఆ గొడవలు కాస్తా ట్విట్టర్‌, ఎఫ్‌ బి లలో జరుగుతున్నాయి. తాజాగా విజయ్ దేవరకొండ నటించిన సినిమా ' నోటా ' విడుదల డేట్‌ పై జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ ఫైరవుతూ...విడుదల డేట్‌ మార్చుకోమంటూ హెచ్చరికలు జారీ చేశారు.
అసలు విషియాని కొస్తే...దేవరకొండ నటించిన `నోటా` చిత్రాన్ని `అరవింద సమేత`కు పోటీగా రిలీజ్ చేయకూడదనేది ఫ్యాన్స్ ఉద్ధేశం. అలా రిలీజ్ చేస్తే `నోటా` బాక్సాఫీస్ వార్ లో ఐపు లేకుండా పోతుందని వార్నింగ్ ఇచ్చారు. ఎన్టీఆర్ సునామీ ముందు ఇంకేదీ నిలవదని అభిమానం చాటుకున్నారు. ఆ క్రమంలోనే దేవరకొండ తన సినిమా నోటా రిలీజ్ కి ఆన్ లైన్ పోల్ నిర్వహిస్తూ పెద్ద షాకిచ్చాడు. నోటా రిలీజ్ కి మూడు తేదీల్లో ఏదో ఒకటి మీరే డిసైడ్ చేయండి అంటూ అక్టోబర్ 5 లేదా 10 లేదా 18 అంటూ తేదీల్ని ప్రకటించాడు. వీటిలో ఏదో ఒక తేదీని ఓటింగ్ ద్వారా ఎంపిక చేయాల్సిందిగా కోరాడు. దీంతో అక్టోబరు 5న ' నోటా ' రిలీజ్‌ అయితే మంచిదని మేకర్స్‌ భావిస్తున్నారు. ఎందుకంటే...ఎన్టీఆర్ `అరవింద సమేత` అక్టోబర్ 10న రిలీజవుతోంది. ఆ తర్వాత అక్టోబర్ 18న రామ్- `హలో గురు ప్రేమకోసమే` - విశాల్- `పందెంకోడి- 2` చిత్రాలు రిలీజవుతున్నాయి. ఇవన్నీ `నోటా`కి ఠఫ్ కాంపిటీషన్ ఇచ్చేవే. `గీత గోవిందం` లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత దేవరకొండ `నోటా`పై భారీ అంచనాలేర్పడ్డాయి. ఈ సినిమా ట్రైలర్ కి చక్కని స్పందన దక్కింది. అయితే ' నోటా ' వీటి మద్య ఎంత కలెక్షన్‌ చేస్తుందో చూడాలి.