' నోటా '.. గీతా గోవిందాన్ని టచ్‌ చేస్తుందా?

12:50 - October 5, 2018

విజయ్ దేవరకొండ..ఇప్పటి వరకూ చేసింది అరడజను సినిమాలు మాత్రమే. అయితే అందులో 70 కోట్ల రేంజ్‌ టచ్‌ చేసింది మాత్రం ఒక్కటే ' గీతా గోవిందం '. అయితే  విజయ్ తాజా చిత్రం 'నోటా' ఈరోజే రిలీజ్ అయింది. ఈ సినిమాతో విజయ్ సత్తాపై ఒక అవగాహనకు రావొచ్చని ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం.  'గీత గోవిందం' ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాబట్టి 70 కోట్ల రేంజ్ టచ్ చేసింది. కానీ 'నోటా' ఒక సీరియస్ పొలిటికల్ థ్రిల్లర్.  ఈ సినిమాకు 'గీత గోవిందం' రేంజ్ కలెక్షన్స్ ఆశించడం కరెక్ట్ కాదు. ఈ సినిమాకు 'అర్జున్ రెడ్డి' రేంజ్ లో కలెక్షన్స్ రావడమే కాస్త కష్టమైన విషయం.. ఎందుకంటే.. యూత్ ను అప్పీల్ చేసే ఎలిమెంట్స్ అయిన  రొమాన్స్.. కామెడీ.. ఈ పొలిటికల్ థ్రిల్లర్ లో ఆశించలేం.  ఇక టాక్ బాగుంటే సరే గానీ టాక్ అటూ ఇటూ ఐతే మాత్రం 'నోటా' సినిమా విజయ్ స్టార్ పవర్ మీదే బాక్స్ ఆఫీస్ దగ్గర నెట్టుకురావలిసి ఉంటుంది. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా  ఓపెనింగ్ డే కలెక్షన్స్ మాత్రం విజయ్ దేవరకొండ రేంజ్ ను సూచిస్తాయి. ఇప్పటివరకైతే బుకింగ్స్ జోరుగా ఉన్నాయి.