నేను చేస్తున్న పనిని రాజకీయం చేయకండి: మనోజ్‌

11:28 - October 23, 2018

నా శ్రేయోభిలాషులకు, మిత్రులకు, ప్రజలకు నాదొక చిన్న విన్నపం. ప్రజలందరికీ ఉపయోగపడేలా ఏదైనా చేయాలని ధృడ నిశ్చయంతో, నా పూర్తి సంతృప్తితో చేస్తున్న  పనికి రాజకీయ రంగు పులమొద్దని కోరుతున్నాడు మంచు మనోజ్. నిన్న తిరుపతికి వెళ్లిన మనోజ్‌కు యూత్ పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. దానికి సంబంధించిన పిక్‌ను ట్విటర్‌లో పోస్ట్ చేశాడు మనోజ్. నాకెంతో ఘన స్వాగతం అందించి, నాపై అపారమైన ప్రేమను చూపించి నన్ను ఆశీర్వదించిన తిరుపతి ప్రజలకు నా ధన్యవాదాలు. ఇక్కడ అన్నీ కుదురుకోనివ్వండి. 2019 మార్చిన జరిగే చిత్రీకరణకు అన్నీ సిద్ధం చేసుకుంటున్నాం. భవిష్యత్‌లో మరింత బలాన్ని, సహాయాన్ని అందించాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా. మనస్ఫూర్తిగా మీ అందరినీ ప్రేమిస్తున్నా అంటూ మనోజ్ ట్వీట్ చేశాడు.