నేను ఆయన పక్కన నటించడం నా అదృష్టం: ఈషా రెబ్బా

10:16 - October 3, 2018

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ' అరవింద సమేత ' ' వీర రాఘవా ' ట్యాగ్‌తో ఈ సినిమా రాబోతుంది. దసరా కానుకగా అక్టోబరు 11న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో మంగళవారం చిత్ర యూనిట్‌ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించింది. ఎంతో మంది అభిమానుల మధ్య అట్టహాసంగా జరిగిన ఈ వేడుకలో ఈ చిత్రంలో నటించిన ఓ హీరోయిన్‌ ఈషా మాట్లాడుతూ...'' యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ గారి పక్కన నటించడం నా అదృష్టంగా భావిస్తున్నాను అని చెప్పింది. ఎన్టీఆర్ గారి పక్కన చేయటమంటే అంత మామూలు విషయం కాదు.. అది నాక్కూడా తెలుసు. సెట్స్ ఎన్టీఆర్ ఉన్నప్పుడు ఎంతో ఎనర్జీగా ఉంటారు. అది మా అందరికీ కూడా పాస్ అవుతుంది. ఇంత మంచి ప్రాజెక్ట్‌లో నాకు అవకాశం ఇచ్చినందుకు త్రివిక్రమ్ గారికి థాంక్స్. ఈ సినిమా నేను చేస్తున్నానని చెప్పగానే ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా సంతోషపడ్డారు. ఒక తెలుగమ్మాయికి త్రివిక్రమ్ గారు అవకాశం ఇచ్చారు. మీ అందరితో తెలుగులో మాట్లాడుతూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. మీలాగానే నేను కూడా ఎన్టీఆర్‌కి పెద్ద అభిమానిని. మీ వల్లనే నేను ఇప్పుడు ఇక్కడున్నాను. అరవింద సమేత చూసి మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు '' అన్నారు.