నేనింకా ఓనమాల వద్దనే వున్నాను : రష్మిక

12:58 - October 11, 2018

' రష్మిక మందన్న ' ఇప్పుడు ఈ హీరోయిన్‌ తెలియని వారులేరు. ' ఛలో ' చిత్రంతోనే మంచి హిట్‌ కొట్టింది. అంతేకాదు వెంటనే ' గీతా గోవిందం 'లో నటించి సూపర్‌ అనిపించుకుంది. ఇక ఇప్పుడు తెలుగులో టాప్‌ హీరోయిన్‌లో రష్మిక ముందుంది అనడంలో ఎటువంటి అతిశయుక్తీ లేదు. రెండు సినిమాలే ఇంతగా పాపులర్‌ అయిన అమ్మడు మాత్రం ఏమంటుందో వినండి. తాజాగా ఒక మీడియా సంస్థతో మాట్లాడిన రష్మిక.. నేను ఒక మంచి నటిని అనుకోవడం లేదు. నటనలో నేను ఇంకా చాలా నేర్చుకోవాల్సి ఉంది. నేను ఇంకా చాలా నటనలో ఓనమాల వద్దే ఉన్నాను. నా నటన నాకే సరిగా నచ్చదు తన ప్రతి సినిమాకు నటనలో మెరుగు పర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాను. ఇక నా అందం గురించి కూడా పలువురు పొగడ్తలు గుప్పిస్తున్నారు. కాని నాకంటే అందగత్తెలు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది ఉన్నారు.  సూపర్ హిట్ దక్కిన ఏ హీరోయిన్ అయినా కూడా తానే గొప్ప అన్నట్లుగా ఫీల్ అవుతూ ఉంటారు. కాని రష్మిక మాత్రం తానో సాదారణమైన హీరోయిన్ నని ఇంకా తాను నేర్చుకోవాల్సింది చాలా ఉందని చెప్పడం అభినందనీయం. . ప్రస్తుతం ఈమె విజయ్ దేవరకొండ ‘డియర్ కామ్రెడ్’ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. దాంతో పాటు కన్నడం మరియు తెలుగులో మరికొన్ని సినిమాలను కూడా ఈమె చేస్తోంది.  దీంతో..ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే లక్షణం రష్మికలో క్లీయర్ గా తెలుస్తుంది.