నీరవ్‌ మోడీ ఖాతాలోకి మరో మోసం

14:58 - October 9, 2018

నీరవ్‌ మోడీ..ఈయన పేరు వినే వుంటారు. అదేనండీ...పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుకు రూ. 14వేల కోట్లు ఎగ్గొట్టిన మహానుబావుడు వజ్రాల వ్యాపారి. ఈయన గారి మోసాలు ఒక్కొక్కటీ బయటికి వస్తున్నాయి. ఈయన మోసాలకు బ్యాంకులే కాదు, ప్రేమికులు కూడా విడిపోతున్నారు. అదేంటీ... అనుకుంటున్నారా? అయితే ఇక వివరాల్లోకి వెళ్దాం...అల్ఫోన్సో అనే వ్యక్తి 2012లో నిరవ్‌ మోడీని ఒక ఈవెంట్‌లో కలిశారట!.అయితే ఈ అల్ఫోన్సో కెనడాకి చెందిన వ్యక్తి. అల్ఫోన్సో తాను ఎంతో కాలంగా ప్రేమిస్తున్న ప్రియురాలికి ఖరీదైన డైమండ్ రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేసి ఎంగేజ్ మెంట్ చేసుకోవాలని అనుకున్నాడు. అల్ఫోన్సో పేమెంట్ ప్రాసెసింగ్ కంపెనీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్.  2018 ఏప్రిల్ లో లక్ష డాలర్ల బడ్జెట్ తో ‘స్పెషల్ ఎంగేజ్ మెంట్ రింగ్’ పంపించాలని నీరవ్ మోడీకి మెయిల్ చేశాడు. అయితే అప్పటికే నీరవ్ మోడీ పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసి విదేశాలకు చెక్కేశాడు. కానీ అల్ఫోన్సోకు ఈ విషయం తెలియలేదు. అదే అదునుగా భావించిన నీరవ్ మోడీ అల్ఫోన్సో ని మోసం చేయడానికి సిద్ధమయ్యాడు. దీంతో...అదే అదునుగా భావించిన నీరవ్ మోడీ నకిలీ డైమండ్ రింగ్ ను అల్ఫోన్సోకు పంపించాడు. దాని ఖరీదు లక్షా 20వేల డాలర్లుగా పేర్కొన్నాడు. ఈ రింగ్ అల్ఫోన్సో ప్రియురాలికి నచ్చడంతో మరో రింగ్ కావాలని ఆమె కోరింది. దీంతో ఆల్ఫోన్సో మరో రింగ్ కోసం మొత్తం 1.48 కోట్లను నీరవ్ మోడీకి చెల్లించి ఉంగరాలను పొందాడు. రింగ్ లను చూసి అనుమానం వచ్చిన అల్పోన్సో ప్రియురాలు వాటిని పరీక్ష చేయించింది. దీంతో అవి నకిలీవేనని తేలింది. విషయం తెలిసిన అల్ఫోన్సో కూడా షాక్ అయ్యారు. తనకు నకిలీ రింగ్ లు ఇస్తావా అని అల్ఫోన్స్ ప్రియరాలు బ్రేకప్ చెప్పి వెళ్లిపోయింది. దీంతో వీరి ప్రేమ పెటాకులైంది.  నీరవ్ మోసం వల్లే తన జీవితం నాశనమైందని భావించి అల్ఫోన్సో రూ.31 కోట్లకు కాలిఫోర్నియా కోర్టులో నీరవ్ పై దావా వేశాడు.