నిర్మాతగా రామ్‌ చరణ్‌ ఎలా వుంటాడో తెలుసా?

17:10 - November 9, 2018

హీరోగా ఉండడం ఒక ఎత్తైతే నిర్మాతగా ఉండడం మరో ఎత్తు.  హీరోగా రామ్ చరణ్ గురించి అందరికీ తెలుసుగానీ నిర్మాత రామ్ చరణ్ ఎలా ఉంటాడు? ఈ విషయం గురించి సీనియర్ హీరో నుండి క్యారెక్టర్ యాక్టర్ అవతారం ఎత్తి సౌత్ లోనే పాపులర్ యాక్టర్ గా మారిన జగపతి బాబు చెప్పాడు. చిరంజీవి తాజా చిత్రం 'సైరా' లో జగపతి ఒక కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమాను రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు.  ఈమధ్యనే జార్జియాలో షూటింగ్ జరిపారు.  అక్కడ వందలాది మంది షూటింగ్ లో పాల్గొన్నారట.  అయితే ప్రతి ఒక్కరికి సరైన వేతనం తో పాటు మంచి వసతులు కల్పించేలా ఏర్పాట్లు చేశాడట.  మంచి ఫుడ్ తో పాటు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండేలా హెల్త్ కేర్ సంగతి కూడా చూసుకున్నాడట.   జూనియర్.. సీనియర్ అనే తేడా లేకుండా అందరిని చక్కగా చూసుకున్నాడని చరణ్ కు కాంప్లిమెంట్ ఇచ్చాడు జగ్గుభాయి. రీసెంట్ గా ఒక వెబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ చరణ్ పై ప్రశంసల వర్షం కురిపించాడు జేబీ. ఇండస్ట్రీలో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే అతితక్కువ మంది వ్యక్తులలో జగ్గుభాయి ఒకరు. ఇక అయన సర్టిఫికేట్ ఇచ్చారంటే తిరుగులేదు.