నిరూపిస్తే..తిరిగిచ్చేస్తా : కౌశల్‌

17:09 - October 4, 2018

ఇటీవల బిగ్‌బాస్‌ సీజన్‌ 2లో కౌశల్‌కు టైటిల్‌ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే కౌశల్‌ను సీజన్‌ మొత్తం గెలిపించింది కౌశల్‌ ఆర్మీ గెలిపించిందనటంలో ఎటువంటి సందేహం లేదు. అయితే బిగ్‌బాస్‌ సీజన్‌2 అయినంత వరకూ కూడా ఇది పెయిడ్‌ ఆర్మీ అంటూ కొన్ని విమర్శలు వచ్చాయి. ఇప్పటికే కౌశల్ ఆర్మీ మెంబర్స్ ఈ విమర్శపై ఘాటుగానే స్పందించారు. ఇక బాబు గోగినేని ఈ విషయమై ఇంకా కూడా వివాదాన్ని కొనసాగిస్తున్నాడు. కౌశల్ విజయం పట్ల బాబు గోగినేని స్పందిస్తూ బిగ్ బాస్ ను సైతం విమర్శించాడు. పెయిడ్ ఆర్మీ అని - డబ్బులతో ఓట్లు కొనుగోలు చేశాడు అంటూ రకరకాలుగా ప్రచారం చేశారు. ఇలాంటి సమయంలో బిగ్ బాస్ విన్నర్ కౌశల్ స్పందించాడు. తన ఆర్మీ గురించి ఎవరైనా విమర్శ చేస్తే ఎంత దూరం వెళ్లేందుకు అయినా తాను సిద్దం అంటూ ప్రకటించాడు. కౌశల్ ఈ విషయమై కాస్త సీరియస్ గానే స్పందిచాడు. తనపై చేస్తున్న ఆరోపనలను నిరూపిస్తే - తాను ఫ్రాడ్ చేసి గెలిచినట్లుగా నిరూపిస్తే తన టైటిల్ ను మరియు ప్రైజ్ మనీని వారికి ఇచ్చేస్తాను అంటూ సవాల్ విసిరాడు. బిగ్‌బాస్‌ సీజన్‌2 మొదలైన దగ్గర నుంచి కౌశల్‌ ఆర్మీ స్టార్ట్‌ అయింది. సీజన్‌తో పాటు కౌశల్‌ ఆర్మీ కూడా క్రమక్రమంగా పెరుగుకుంటూ వచ్చి, సీజన్‌ చివరికల్లా షో మొత్తాన్ని తమ కంట్రోల్లోకి తెచ్చుకుంది కౌశల్‌ ఆర్మీ. ఇంతటి పవర్‌ ఫుల్‌ ఆర్మీ ని పెయిడ్‌ ఆర్మీ అంటూ విమర్శలు చేసేవారిపై కౌశల్‌ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.