నిమ్స్‌లో కేసీఆర్‌ దీక్ష వేనుక వున్న అసలు రహస్యం

09:38 - October 6, 2018

తెలంగాణ కోసం కేసీఆర్‌ చావు అంచులుదాకా వెల్లి వచ్చారని, దానికోసం నిమ్స్‌లో ఏమీ తినకుండా, నిరాహార దీక్ష చేశారని దానితో దెబ్బకు తెలంగాణ వచ్చిందని అందరికి తెలిసిని విషియం. కానీ అసలు ఆ దీక్ష నిజం కాదట!. అవునండీ..టీపీసీసీ ఛీఫ్‌ ఉత్తమ కుమార్‌ రెడ్డి గారు చెప్తున్నారు...వినండి. ' తెలంగాణ పేరుతో సీఎం కేసీఆర్‌ ప్రజలను దోచుకుంటున్నాడు. చావు నోట్లో తలపెట్టి తెలంగాణను సాధించానని చెబుతున్న మాటలన్నీ అబద్దాలే. ఆమరణ దీక్షకు దిగిన కేసీఆర్‌ను ఖమ్మంకు తరలించిన రెండు గంటల్లోపే కాంపౌండర్‌ చేతిలోని పండ్ల రసాన్ని గుం జుకొని తాగాడు. ఆ పరిణామాన్ని నిరసిస్తూ ఓయూ విద్యార్థులు కేసీఆర్‌ శవయాత్ర చేయటంతో నిమ్స్‌లో దొంగ దీక్షకు దిగాడు. హైలీ మల్టీ విటమిన్లు ఉండే ఫ్లూయిడ్స్‌తో పాటు మల్టీ విటమిన్‌ ఇంజక్షన్లు రోజుకు 2 సార్లు తీసుకుంటూ దొంగ దీక్ష చేశాడు. మణిపూర్‌లో ఇరోమ్‌ షర్మిల అనే మహిళ ఇదే ఇంజక్షన్‌తో 12 ఏళ్లు దీక్ష చేసింది. నిమ్స్‌లో దీక్ష పేరిట కేసీఆర్‌ చేసింది కేవలం గడ్డం పెంచటమే'  అని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్‌ దగాకోరు, మోసగాడు అంటూ నిమ్స్‌లో దీక్ష సందర్భంగా ఆయనకు ఇచ్చిన మల్టీవిటమిన్‌ ఇంజక్షన్లు, ఫ్లూయిడ్స్‌ తాలూకు వివరాలను మీడియాకు విడుదల చేశారు. శుక్రవారం గ్రేటర్‌ హైదరాబాద్‌ కాంగ్రెస్‌ కమిటీ సమావేశంలో ఉత్త మ్‌ మాట్లాడారు. దీక్ష విరమించాక కేసీఆర్‌ విద్యార్థులను ఆత్మహత్యలకు పురిగొల్పాడని ధ్వజమెత్తారు. ప్రస్తుతం కనీసం ఆ అమరుల కుటుంబాలను కూడా పరామర్శించటం లేదన్నారు. అంబేడ్కర్‌,జగ్జీవన్‌రాం జయంతి సందర్భంగా వారి విగ్రహాలకు కనీసం పూలమాలలు కూడా వేయని వ్యక్తిత్వం కేసీఆర్‌దని మండిపడ్డారు.

అదండీ సంగతి...
కేసీఆర్‌ అధికారానికి వచ్చాకే ప్రజలను మోసం చేస్తున్నారనుకున్నాము, కానీ సారు రాకతలికి నుంచే రాష్ట్ర ప్రజలను నమ్మించి మోసం చేస్తున్నారనమాట!..మరి ఇప్పుడు ముందస్తు ఎన్నికలకు శ్రీకారం చుట్టారు సరే..గతంలో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ కూడా నెరవేర్చలేదు, మరి ఇప్పుడు ఏవిధంగా మళ్లీ ఓట్లడుగుతారో?..అది వారికే తెలియాలి. మొత్తానికి రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితులను చూస్తుంటే..ఒక పక్క వామపక్షాలు, మరొపక్క మహాకూటమితో టీఆర్‌ఎస్‌ నాయకులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు కనిపిస్తుంది.