నిబందనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: సీపీ హెచ్చరిక

12:50 - December 6, 2018

అసెంబ్లీ ఎన్నికల సమరాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొడానికి పోలీస్‌ శాఖ తరుపున సిద్దంగా వున్నామని ట్రై కమీషనరేట్ల సీపీలు స్పష్టం చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా, నిబంధనలను ఉల్లంఘించినా వెంటనే కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వివిధ పార్టీల అభ్యర్థులు, శ్రేణులను హెచ్చరించారు. బుదవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఈ విషియాలను వెల్లడించారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌కు సంబంధించిన బందోబస్తు వివరాలను నగర సీపీ అంజనీకుమార్‌ విలేకరుల సమావేశంలో వివరించారు.

 

•    హైదరాబాద్‌ నగరంలో 15 నియోజకవర్గాలు పూర్తిగా ఉన్నాయి.

•    ప్రతి నియోజకవర్గానికి ఏసీపీ అధికారి నోడల్‌ అధికారిగా ఉంటారు.
•    సైబరాబాద్‌4 రాచకొండ పరిధుల్లోని  నియోజకవర్గాలకు సంబంధించి కొంత భాగం ఉంది.
•    అత్యంత సమస్యాత్మక కేంద్రాలు కేంద్రాలు 21
•     నగరంలో మొత్తం పోలింగ్‌ స్టేషన్లు-3611,  పోలింగ్‌ ప్రదేశాలు-1574, వాటిలో అతి సున్నిత కేంద్రాలు-161, సున్నిత కేంద్రాలు-334
•    మొత్తం పోలీస్‌ రూట్లు 426
•    క్విక్‌ రియాక్షన్‌ టీమ్‌లు 60, స్పెషల్‌ టీమ్‌లు 17
•    నిరంతర నిఘాకు సర్విలెన్స్‌ బృందాలు 3, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ టీమ్‌లు 3
•    పోలింగ్‌ రోజున పనిచేసే చెక్‌పోస్టులు 51
•    సరిహద్దు చెక్‌పోస్టులు 12, లా అండ్‌ ఆర్డర్‌ పికెట్‌లు 302
•    కమ్యూనికేషన్‌ విభాగానికి అందుబాటులో 3300 పరికరాలు.
•    93అంతర్గత టీమ్‌లు, 60 షాడో టీమ్‌లతో 518  చెక్‌పోస్టులు/పికెట్‌లు ఉంటాయి.

పటిష్ఠ బందోబస్తుకు 20వేల మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. మహిళా సిబ్బందితో కలిపి ఇన్‌స్పెక్టర్లు-225మంది,  ఎస్సైలు-531, ఏఎస్సైలు-535, హెడ్‌ కానిస్టేబుళ్లు-1407, కానిస్టేబుళ్లు- 6107, ఎఫ్‌పీఓలు-480, హోంగార్డులు-5360, కేంద్ర బలగాలు-22 కంపెనీలు (2200) ,ఓడీ-1000తో పాటు బీఎ్‌సఎఫ్‌, ఆర్‌ఏఎఫ్‌, ఇతర బలగాలను మోహరించారు. అదనంగా సీపీ స్వీయ పర్యవేక్షణలో అదనపు సీపీలు, జాయింట్‌ సీపీలు, డీసీపీలు, ఏసీపీలతోపాటు వివిధ స్థాయిల్లోని అధికారులు విధుల్లో ఉంటారు.

ప్రచార గడువు ముగియడంతో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై వెంటనే ఇన్‌స్పెక్టర్‌ స్థాయి అధికారులు కేసులు నమోదు చేస్తారు. ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన 10 వేల సీసీకెమెరాలతో పాటు నగరంలోని 2. 47లక్షల సీసీకెమెరాల ఫుటేజీనీ ఆధారాలుగా తీసుకుంటాం.

గురువారం బ్లాక్‌ డే సందర్భంగా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఉన్నతాధికారులందరూ అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తుంటారు. నగరంలో144  సెక్షన్‌ అమల్లో ఉన్నందున ర్యాలీలు, ధర్నాలకు అనుమతి లేదు.

అభ్యర్థికి కేటాయించిన వాహనంతోపాటు అతని ఏజెంట్‌, కార్యకర్తకు అనుమతి ఉన్న వాహనాన్నే పోలింగ్‌ బూత్‌కు 100 మీటర్ల దూరం పరిధి వరకు అనుమతిస్తారు. ఓటర్లు 200 మీటర్ల దూరంలోనే వాహనాన్ని పార్క్‌ చేయాలి. అంతే దూరంలో టేబుల్‌ ఏర్పాటుచేసుకోవచ్చు. అభ్యర్థులకు సంబంధించి షామియానాలు, టెంట్ల ఏర్పాటుకు అనుమతి లేదు. పోలింగ్‌ బూత్‌ లోపలికి సెల్‌ఫోన్లకు అనుమతి లేదు. ఎమర్జెన్సీ వాహనాలు, అంబులెన్స్‌, ఆర్టీసీ బస్సులు, వాటర్‌, ఎలక్ట్రిసిటీ వాహనాలకు ఈ నిబంధనలు వర్తించవు.

ఒక్కో కమిషనరేట్‌కు 12వేల మంది చొప్పున 24వేల మంది పోలీసులు ఎన్నికల విధుల్లో ఉంటారు. ఉత్తరప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు మహారాష్ట్ర నుంచి రాచకొండకు-5, సైబరాబాద్‌కు-6 కంపెనీల ప్రత్యేక బలగాలు వచ్చాయి. ప్రతి నియోజకవర్గానికి ఏసీపీ స్థాయి అధికారిని నోడల్‌ ఆఫీసర్‌గా ఉంటారు. మొబైల్‌ రూట్స్‌-263, ఫ్లైయింగ్‌ స్క్వాడ్స్‌-27, సర్విలైన్‌ టీమ్స్‌-27, చెక్‌ పాయింట్స్‌-11 ఏర్పాటుచేశారు. రెండు కమిషనరేట్ల పరిధిలో ఇదే సంఖ్యలో ఉంటాయి.

అన్ని పోలింగ్‌ కేంద్రాలను జియో ట్యాగింగ్‌ చేశారు. ప్రతి కేంద్రంలో మైక్రో అబ్జర్వర్స్‌, వెబ్‌ కాస్టింగ్‌, సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌ బృందాలు, పీటీజెడ్‌ కెమెరాలు కలిగిన మొబైల్‌ వ్యాన్లు అందుబాటులో ఉంటాయి. ఒక్కో పీటీజెడ్‌ కెమెరా కిలోమీటరు ప్రాంతాన్ని కవర్‌ చేస్తుంది. కమాండ్‌ కంట్రోల్‌తో అనుసంధానం ఉంటుంది. ఆ వాహనాలు తిరుగుతూనే ఉంటాయి.