నిధి అగర్వాల్‌ ఆ యాడ్‌ చేసేందుకు నో అన్నదట!

11:02 - December 13, 2018

డబ్బులు వస్తున్నాయంటే.. బూడిదను సైతం ఆకాశ భస్మం పేరుతో అమ్మేసే రకం అంతకంతకూ ఎక్కువ అవుతోంది. అలాంటివేళ.. జస్ట్ మా ఉత్పత్తికి ప్రచారకర్తగా ఉండండి.. డబ్బులిస్తామంటే.. ఓకే అనేసే రకం పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉంటుంది.  కానీ.. ఇందుకు భిన్నంగా యంగ్ బ్యూటీ ఒకరు నో చెప్పేసిన వైనం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సవ్యసాచి తో పరిచయమై.. ప్రస్తుతం అఖిల్తో మిస్టర్ మజ్ను చేస్తున్న ముద్దుగుమ్మ నిధి అగర్వాల్. అందాల నిధిలో ఆకర్షించే గుణమే కాదు.. అంతకు మించి చాలానే విషయాలున్నట్లుగా చెప్పాలి. వివారాల్లోకి వెలితే... ఇటీవల ఒక ఫేస్ క్రీం ఉత్పత్తికి బ్రాండ్ అంబాసిడర్ గా అడిగితే నో చెప్పేసిందట. యాడ్ చేస్తే వచ్చే పైసల్ని ఎందుకు కాదన్నావ్ అంటే.. ఆమె ఊహించనిరీతిలో సమాధానం ఇచ్చింది. హీరోయిన్లు ఒక ఉత్పత్తికి ప్రచారం చేస్తున్నారంటే.. దాని మీద ప్రజల్లో క్రేజ్ ఉంటుంది. క్రీంకు ప్రచారం చేయమన్నారు. నాకేమో అలాంటి వాటి మీద నమ్మకం లేదు. సహజసిద్ధంగా లభించే వాటిని వాడితే బ్యూటీ మరింత పెరుగుతుంది. అలాంటప్పుడు డబ్బులు కోసం ఫలానా క్రీం వాడమని చెప్పటమేంటి? అందుకే రిజెక్ట్ చేశానని చెప్పింది. అంతేకాదు ఈయాడ్‌ పోతే ఇంక యాడ్స్‌ రావు అనుకోటానికి వీల్లేదు. ఎందుకంటే ఆ ఫేస్ క్రీం యాడ్ ను రిజెక్ట్ చేశాక.. మరో యాడ్స్ వచ్చాయని చెప్పింది.