నిత్య ఆలోచన మార్చుకుందట!

16:36 - November 12, 2018

హీరోయిన్ గా చేసినా సపోర్టింగ్ రోల్ తో మెప్పించినా తనకంటూ ఒక ప్రత్యేకత నిలుపుకునే నిత్య మీనన్ ఇప్పటికీ సబ్జెక్ట్ సెలక్షన్ లో ఇదే ఫార్ములాను కొనసాగిస్తూనే ఉంది. ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడులో సావిత్రి గారి పాత్ర చేస్తున్న నిత్య మీనన్ లుక్ ఇటీవలే క్రిష్ పుట్టిన రోజు సందర్భంగా బయటికి వచ్చిన సంగతి తెలిసిందే. అభిమానులు పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు. తనకు ఫాలోయింగ్ కూడా బాగా ఉంది. కాకపోతే నిత్యతో ఉన్న చిక్కల్లా తన బరువే. ఎవరెన్ని కామెంట్స్‌ చేసినా, అభిమానులు ఎన్ని సలహాలు ఇచ్చినా వాటన్నింటనీ లైట్‌ తీసుకుని ఇప్పటిదాకా అతే బరువుతో నడిపించేసింది. కానీ ఇప్పుడు ఆమె ఆలోచన మార్చుకుందట!..ఆమె లావు తగ్గడానికి నిర్ణయించుకుందట!.దానికోసమై ఆహార నియమాలతో పాటు కఠినమైన ఎక్స్ సర్సైజులు కూడా చేస్తోందట. బాలీవుడ్ లో చేస్తున్న మిషన్ మంగళ్ కోసం ఈ డైట్‌ తప్పలేదట!.  హిందీ సినిమాల్లో అవకాశాలు రావాలన్నా మనుగడ సాగించాలన్న బాడీ కంట్రోల్ లో ఉండాల్సిందే. రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పటికే సైజ్ జీరోకు వచ్చినా ఇంకా తగ్గడం గురించి ఫోకస్ పెడుతోంది. భూమి పెడ్నేకర్ ఈ కారణంగానే సుమారు ఇరవై కిలోల బరువు తగ్గించుకుని రాజ్ కుమార్ రావు తో డెబ్యూ నుంచి అక్షయ్ కుమార్ తో టాయిలెట్ చేసే దాకా ఛాన్స్ కొట్టేసింది. సో నిత్య మీనన్ రైట్ ట్రాక్ లో ఉన్నట్టే. కాకపోతే బొద్దుగా చూడటం అలవాటైన మనకళ్లకు సన్నబడ్డ తనను చూడటం ఎలా అనిపిస్తుందో వేచి చూడాలి. చక్కనమ్మ చిక్కినా అందమే అనే నానుడికి ఉదాహరణగా నిలుస్తుందేమో.