నిజాన్ని ఎవరు చూపించబోతున్నారు..బాలయ్యనా?..వర్మనా?

14:57 - October 24, 2018

ఎన్టీఆర్‌ జీవిత చరిత్ర ఆధారంగా ' ఎన్టీఆర్‌ 'బయోపిక్‌ను బాలయ్య తీస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో అన్ని సన్నివేశాలనూ చూపిస్తారా? లేదా అంతా సానుకూలంగా ఎటువంటి వివాదాలు లేకుండా చూపిస్తారా? అంటే సాధ్యమైనంత వరకూ ఎటువంటి వివాదాలు దీనిలో చూపించకుండా వుంటారనే సమాచారం. ఇదిలా వుంటే ఇటీవల రామ్‌ గోపాల్‌ వర్మ ' లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ 'ను తెరకెక్కిస్తున్నట్లు చెప్పారు. ఇందులో ఎన్టీఆర్‌ను వెనుపోటు పొడిచిన సీన్‌ ఖచ్చితంగా వుంటుందనేది సమాచారం. అయితే ఎన్టీఆర్‌ గురించి ఎందులో పూర్తి వివరాలతో, వివాదాలతో చూపిస్తారో వేచి చూడాల్సిందే. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఎన్టీఆర్ సినిమా.. రాజకీయ జీవితంతో పాటు ఇందిర కారణంగా ఎన్టీఆర్ పదవీచ్యుతుడు కావటం.. ఆ తర్వాత వెల్లువలా విరుచుకుపడిన ప్రజాగ్రహంతో ఉక్కుమహిళ ఒక అడుగు వెనక్కి వేసి ఎన్టీఆర్ ను సీఎం సీటులో కూర్చోబెట్టటం వరకూ ఉంటుందని చెబుతున్నారు. బాలయ్య సినిమా ఎక్కడితో ఆగుతుందో.. అక్కడి నుంచే వర్మ మూవీ మొదలవుతుందట. 85-89 మధ్య కాలంలో ఎన్టీఆర్ పాలన.. వివాదాస్పద నిర్ణయాలు.. 89లో ఓటమి.. తర్వాత సొంత కుటుంబం నుంచి ఎదుర్కొన్న నిరాదరణ.. ఆనారోగ్యం.. రాజకీయ అవమానాలు.. లక్ష్మీపార్వతి ఆయన జీవితంలోకి ప్రవేశించటం.. ఆమెతో పెళ్లి.. 1994లో కాంగ్రెస్ ను మట్టి కరిపించిన వైనాలు అన్ని ఉంటాయట. అల్లుడు చంద్రబాబు అంచనాలకు భిన్నంగా ఎన్టీఆర్ ఎన్నికల్లో విజయం సాధించిన తీరుతో పాటు.. తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత బాబు వెన్నుపోటు.. ఆ తర్వాతి పరిణామాలు.. ఎన్టీఆర్ మరణం వర్మ మూవీలో ఉంటుందని చెబుతున్నారు. అందరికి తెలిసిన విషయాల్ని తీసుకొని బాలయ్య మూవీ సినిమా తీయటం ఆసక్తికరమే అయినా.. సంచలన అంశం.. తెలుగు రాష్ట్ర రాజకీయ చరిత్రకు కీలకమైన అంశాన్నిపాయింట్ గా తీసుకొని తెరకెక్కించే వర్మ మూవీనే ఆకట్టుకునే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది. ఎవరైతే నిజాన్ని నిర్బయంగా చెప్పగలుగుతారో.. వారి సినిమానే ప్రజలు ఆశీర్వదిస్తారని చెప్పక తప్పదు.