నిజాం నవాబు కాలానికి వెళ్లి మరీ లవ్‌ చేయనున్న వరుణ్‌ తేజ్‌...

11:37 - October 29, 2018

టాలీవుడ్ లో ఇప్పుడు రెండు మూడు ట్రెండ్స్ ఉన్నాయి.  ఒకటి - బోల్డ్ కంటెంట్ ఫిలిమ్స్.. రెండు- బయోపిక్స్.. మూడు- పీరియడ్ ఫిలిమ్స్. తాజాగా మెగా హీరో వరుణ్ తేజ్ ఒక పీరియడ్ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.  'అప్పట్లో ఒకడుండేవాడు' చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు సాగర్ చంద్ర నిజామ్ నవాబుల కాలం నేపథ్యంలో సాగే ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ తో వరుణ్ తేజ్ ను మెప్పించాడట.   అంతే కాదు ఇది మనసుకు హత్తుకొనే ఒక ప్రేమ కథ అని సమాచారం. 'ఫిదా' తర్వాత తెలంగాణా నేపథ్యంలో వరుణ్ తేజ్ కు ఇది రెండో సినిమా అవుతుంది.  నిజానికి 'ఫిదా' తోనే వరుణ్ తేజ్ కు ఫస్ట్ బ్లాక్ బస్టర్ వచ్చింది.  మరి ఈసారి నిజామ్ నవాబుల కాలానికి వెళ్ళి మరీ లవ్ చేయడానికి రెడీ అవుతున్నాడు. దీంతో డిఫరెంట్ కాన్సెప్ట్ లు ఎంచుకుంటాడనే పేరును వరుణ్ తేజ్ మరోసారి నిలబెట్టుకున్నట్టే.  సాగర్ చంద్ర తన మొదటి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. 90'ల కాలాన్ని సినిమాలో చూపించిన విధానానికి ప్రేక్షకులు కూడా ఇంప్రెస్ అయ్యారు. ఇప్పుడు ఏకంగా నిజాం కాలాన్ని ఎంచుకోవడం విశేషమే.