నా వెనుక ఎవరూ లేరు : శృతి

12:15 - October 25, 2018

సౌత్ స్టార్ హీరో అర్జున్ పై శృతి హరిహరన్ చేసిన ఆరోపణలు ప్రస్తుతం పెద్ద ఎత్తున దుమారంను రేపుతున్నాయి. శృతి హరిహరన్ కు మద్దతుగా నిలుస్తున్న వారిలో ముఖ్యంగా ప్రకాష్ రాజ్ - శ్రద్దా శ్రీనాథ్ - చేతన్ - కవితలు ఉన్నారు. వీరంతా కూడా శృతికి అర్జున్ వెంటనే క్షమాపణలు చెప్పాలని - ఆయన క్షమాపణలు చెప్పకుంటే కన్నడ సినిమా పరిశ్రమ పెద్దలు చర్యలు తీసుకోవాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు. అర్జున్ అలాంటి వ్యక్తి కాదని శృతి వెనుక కొన్ని శక్తులు ఉండి నడిపిస్తున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ వస్తున్న నేపథ్యంలో తాజాగా శృతి స్పందించింది. తాను ఎవరి చేతనో నడిపించబడటం లేదని తనను ఎవరు వెనకుండి నడిపించడం లేదని క్లారిటీ ఇచ్చింది. తనకు ఉన్న సొంత జ్ఞానం ప్రకారం నేను నడుచుకుంటున్నాను అంటూ ఒక ఇంటర్వ్యూలో పేర్కొంది. నాపై జరిగిన లైంగిక దాడి గురించి నేను చెబితే నాపై విమర్శలు చేయడం ఏంటని శృతి ఆవేదన వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లుగా నా వెనుక ప్రకాష్ రాజ్ గారు కాని - కవిత గారు కాని - చేతన్ గారు కాని ఎవరు లేరు. వారు నాకు మద్దతుగా నిలిచినందుకు కృతజ్ఞతురాలిని అంటూ శృతి పేర్కొంది.