నా రాణీ అంటూ...! స్పేషల్‌ విషెస్‌ చెప్తున్న బన్నీ

15:26 - September 29, 2018

ఈ రోజు (సెప్టెంబర్ 29బన్నీ సతీమణి స్నేహారెడ్డి పుట్టిన రోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా తన సతీమణికి స్పెషల్‌గా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశాడు బన్నీ. ''  హ్యాపీ బర్త్ డే క్యూటీ..'' అని చెబుతూ ' ప్రేమతో నా రాణి ' అని పేర్కొన్నాడు. దీంతో పాటు దంపతులిద్దరూ కలిసి దిగిన ఓ పిక్ పంచుకున్నాడు. ఈ మధ్యకాలంలో తమ తమ షూటింగులతో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో యమ యాక్టీవ్‌గా ఉంటున్నారు స్టార్ హీరోలంతా. అందులో ముఖ్యంగా చెప్పుకుంటే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పేరే ముందుంటుంది. తనకు, తన ఫ్యామిలీకి సంబందించిన ప్రత్యేక సందర్భాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు బన్నీ. కాస్త తీరిక దొరికిందంటే చాలు తన ఫ్యామిలీతో, పిల్లలతో సరదాగా గడుపుతుంటాడు బన్నీ. సినీ కెరీర్‌తో పాటుగా తన ఫ్యామిలీ మెంబెర్స్‌కి కూడా సమాన ప్రాధాన్యత ఇస్తూ.. అందరితో సరదాగా గడపడం ఈ స్టైలిష్ స్టార్ స్టైల్.