నాలుగున్నర సంవత్సరాల్లో అంతా తలకిందులాయే!

15:45 - November 24, 2018

 

రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై ఆర్బీఐ వెలువరించిన తాజా నివేదికలో తెలుగు రాష్ట్రాలపై ఆసక్తికర గణాంకాలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్ర విభజన తర్వాత ధనిక రాష్ట్రంగా భావిస్తున్న తెలంగాణ ప్రస్తుతం అప్పుల్లో కూరుకుపోతుంది. గత ఏడాది కాలంలో తెలంగాణ అప్పులు 9.5 శాతం పెరిగినట్టు ఆర్బీఐ వెల్లడించింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ)పై అప్పు 22.2 శాతం పెరిగిందనీ... 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఇది 12.7 శాతంగా ఉందని ఆర్బీఐ పేర్కొంది. ‘రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలు: ఆదాయ వ్యయాలపై అధ్యయనం’ పేరుతో... దేశంలోని అన్ని రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై ఆర్బీఐ నివేదిక వెలువరించింది. రుణమాఫీలతో పాటు ప్రయివేటు పెట్టుబడుల ప్రయోజనాలను దెబ్బతీసే మితిమీరిన అప్పుల కారణంగా పలు రాష్ట్రాలు ఆర్థిక ఒత్తిడికి గురవుతున్నాయని కేంద్రీయ బ్యాంకు అభిప్రాయం వ్యక్తం చేసింది. ఆర్బీఐ లెక్కప్రకారం జీఎస్‌డీపీలో రుణాల నిష్పత్తి పెరగడమంటే ఆర్థిక నిర్వహణ అసమర్థంగా ఉన్నట్టే. రాష్ట్రంలో ఆర్థిక నిర్వహణ దారుణంగా ఉందంటూ తెలంగాణపై కాగ్ వెలువరించిన వార్షిక నివేదికను సైతం ఆర్బీఐ సమర్థించింది. తెలంగాణలో కేవలం ఒక్క ఏడాదిలోనే అభివృద్ధియేతర వ్యయం (పరిపాలనా పరమైన ఖర్చులు) ఇంతలా ఎలా పెరిగిందని ఆర్బీఐ తన నివేదికలో విస్మయం వ్యక్తం చేసింది. 2016 - 17 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ అభివృద్ధియేతర వ్యయం 3.4 శాతంగా ఉండగా... ఈ సారి ఇది ఏకంగా 35.2  శాతానికి ఎగబాకడం గమనార్హం. తెలంగాణ వచ్చిందని సంబరపడ్డ ప్రజల ఆశలు ఆవిరయిపాయే, నాలుగున్నర సంవత్సరాల్లో కేసీఆర్‌ దొర రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి ముందస్తు ఎన్నికలు పెట్టి తప్పుకుంటుండు. వాల్ల కొడుకు, బిడ్డ, అల్లుడుకి ఆస్తులు వారసత్వంగా ఇచ్చిన కేసీఆర్‌ సారు...రాష్ట్రానికి అప్పులు వారసత్వంగా ఇచ్చిండు. మళ్లీ ఇప్పుడు ఎన్నికల్లో నిలబడి నాకే ఓటెయ్యండీ అని ప్రజలనడుగుతుండు. ప్రజలేమన్నా వెర్రివాల్లనుకున్నారేమో సారు గారు. ఇక ఈ ఎన్నికల్లో ఓటు ఎవరికేయాలో ప్రజలు ఆలోచించుకోని వేయల్సిన బాధ్యత అందరిపైనా ఉన్నట్లే!..జర జాగ్రత్తగా మీ ఓటు వేయండి ప్రజలారా!.