నానీ సినిమాలో నర్తనశాల బ్యూటీ..

14:01 - September 5, 2018

న్యాచురల్‌ స్టార్‌ నానీ ఈ మధ్య తన సినిమాల్లో కొత్త హీరోయిన్లకు అవకాశం ఇస్తున్నాడు. కృష్ణార్జున యుద్ధం లో రుఖ్సార్ ధిల్లాన్.. దేవదాస్ లో రష్మిక మందన్న .. ఇప్పుడేమో కష్మీర పరదేశి.

నానీ తాజాగా...'జెర్సీ' అనే స్పోర్ట్స్ నేపథ్యం ఉన్న సినిమాను లైన్ లో పెట్టాడు. 'మళ్ళీ రావా' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు. త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళనుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో నానికి జోడీగా కష్మీర పరదేశి ని ఎంపిక చేశారట. ఈ పూణే సుందరి నాగ శౌర్య హీరో గా నటించిన ' నర్తనశాల' సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్లోకి అడుగుపెట్టింది. బబ్లీ గర్ల్ లా కనిపించిన ఈ కొత్త బ్యూటీ నాని కూడా ఇంప్రెస్ చేసిందట. దీంతో నాని సినిమాలో హీరోయిన్ గా లక్కీ ఛాన్స్  కొట్టేసింది.