నానీ మళ్లీ రిస్క్‌ తీసుకుంటాడా...?

12:40 - September 25, 2018

అష్టాచమ్మ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నానీ..అదే సినిమాతో మంచి నటుడిగా కూడా పేరు తెచ్చుకున్నాడు.నానీ సినమాల విషయంలోనూ, కథల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చాడు. అయితే 2014లో నాని ‘ఆహా కళ్యాణం’ చిత్రంకు ఓకే చెప్పి తప్పు చేశాడు అంటూ విమర్శలు వచ్చాయి. బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ వారి బ్యానర్ లో సినిమా అనగానే నాని ఓకే చెప్పాడు తప్ప - తనకు ఆ కథ సెట్ అవుతుందా అనేది చూసుకోలేదు. అంతకు ముందు ‘భీమిలి కబడ్డి జట్టు’ చిత్రం కూడా రీమేక్ గా చేశాడు. ఈ రెండు రీమేక్ లు కూడా నిరాశ పర్చిన నేపథ్యంలో నాలుగున్నర సంవత్సరాలుగా రీమేక్ లకు పూర్తి దూరంగా ఉంటూ వస్తున్నాడు. ఇదిలావుంటే...తమిళంలో విజయ్ సేతుపతి - త్రిష జంటగా తెరకెక్కిన ‘96’ చిత్రం అక్కడ భారీ అంచనాలను కలిగి ఉంది. వచ్చే నెల 4న అక్కడ విడుదల కాబోతున్న 96 చిత్రాన్ని తెలుగులో దిల్ రాజు కొనుగోలు చేశాడు.  ఈ రీమేక్ కు నాని అయితే బాగుంటుందని దిల్ రాజు భావించాడట. దిల్ రాజు ఇదే విషయాన్ని నానితో చెప్పగా ఆసక్తికరంగా ఉన్నట్లుగా స్పందించాడట. ప్రస్తుతం ‘దేవదాస్’తో బిజీగా ఉన్న నాని ఆ తర్వాత ‘96’ చిత్రాన్ని చూసి తన ఫైనల్ నిర్ణయాన్ని చెప్పే అవకాశం ఉంది. దిల్ రాజు ఖచ్చితంగా నానిని ఒప్పిస్తాడని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఇప్పటి వరకు చేసిన రెండు రీమేక్ లు ఫ్లాప్ అయిన నేపథ్యంలో నాని మరోసారి రిస్క్ ను తీసుకుంటాడా అనేది చూడాలి.