నానీ పాత్రలో వైభవ్‌

11:40 - August 31, 2018

శివా నిర్వాణ దర్శకత్వంలో నాని, ఆది పినిశెట్టి, నివేథా ముఖ్య పాత్రల్లో కనిపించిన చిత్రం ‘నిన్ను కోరి’. 2017లో రిలీజ్‌ అయిన ‘నిన్ను కోరి’ చిత్రాన్ని తమిళంలోకి రీమేక్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు హీరో వైభవ్‌. దీనిలో తెలుగులో నాని పోషించిన క్యారెక్టర్‌ను తమిళంలో వైభవ్‌ చేస్తున్నారు.  ఆది పినిశెట్టి, నివేథా పాత్రలను ఇంకా ఫైనలైజ్‌ చేయాల్సి ఉంది. ఈ రీమేక్‌ను కాస్మో కిరణ్‌ నిర్మించనున్నారు. ఇంకా దర్శకుడు ఎంపిక పూర్తి కాలేదు.  హీరో వైభవ్‌ ‘గొడవ’తో తెలుగులో ఎంట్రీ ఇచ్చినప్పటికీ తమిళంలో బిజీ ఆర్టిస్ట్‌గా ఉన్నారు.